• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నం బట్టివాడకు చెందిన తాటికొండ రవీందర్ అనే వ్యక్తి శనివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న మృతుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కేంసారం సంపత్ తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

February 28, 2026 / 03:00 PM IST

రాజగోపుర ప్రతిష్టపనలో పాల్గొన్న టీపీసీసీ సభ్యుడు

RR: మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్, సౌభాగ్యపురంలో అలివేలుమంగ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానములో రాజగోపుర ప్రతిష్ఠాపన మహోత్సవం, కుంభప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మహాత్సవానికి టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 28, 2026 / 02:59 PM IST

గచ్చిబౌలిలో కిషన్ రెడ్డితో రోబో

HYD: నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ 2026 స్పేస్ కన్వెన్షన్ ప్రాజెక్ట్ ఎక్స్ పోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను, ఆవిష్కరణలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఓ రోబో ఆయనకు షేక్యాండ్ ఇచ్చి, స్వాగతం పలికింది. కిషన్ రెడ్డి వెంట పలువురు అధికారులు ఉన్నారు.

February 28, 2026 / 02:55 PM IST

రోడ్డు ప్రమాదం.. రిటైర్డ్ టీచర్ మృతి

NZB: ఆర్మూర్ పట్టణ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ టీచర్ నాగులపల్లి గంగారం మృతి చెందారు. పని నిమిత్తం ఆర్మూర్ వచ్చిన ఆయన, స్వగ్రామం అర్గుల్‌కు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గంగారాన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతిని ధృవీకరించారు.

February 28, 2026 / 02:52 PM IST

బ్రహ్మోత్సవాల అన్నదానానికి మంత్రి విరాళం

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, ధర్మపురి పట్టణం వార్తక, వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ తనవంతు చేయూతను అందించారు. ఆయన అన్నదాన కమిటీ సభ్యులకు రూ. 50,016 విరాళంగా అందజేశారు. కమిటీ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 02:51 PM IST

ఇంటర్ పరీక్షకు 98 శాతం హాజరు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 98% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 4,748 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4668 మంది పరీక్ష రాశారు. 80 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

February 28, 2026 / 02:49 PM IST

సేవాలాల్ చూపిన బాటలో నడవాలి: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు నియోజకవర్గంలోని సింగరేణి గ్రౌండ్లో శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ముగింపు సభ శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ చూపిన బాటలో నేటితరం నడవాలని సూచించారు. వారితో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కుమార్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.

February 28, 2026 / 02:49 PM IST

మున్సిపల్ మాజీ ఛైర్మన్‌కు బెయిల్ మంజూరు

మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్‌కు మెదక్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. పట్టణంలోని పిట్లంబేస్‌కు చెందిన వ్యక్తి ఇంటిపై దాడికి యత్నించారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయనను ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. ఆయన విడుదలపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

February 28, 2026 / 02:48 PM IST

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

JGL: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, సురక్షిత ప్రయాణాన్ని కల్పించే లక్ష్యంతో జగిత్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో శనివారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఆటో, బస్సు, లారీ, ఇతర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు.

February 28, 2026 / 02:47 PM IST

భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం

NRML: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలోని కీర్తన అనే రెండేళ్ల పసి పాప కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పాపను హత్య చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో రత్నకల్యానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 28, 2026 / 02:47 PM IST

జియో ఆఫీస్‌ను ముట్టడిస్తాం: రవి ముదిరాజ్

MBNR: ఉద్యోగం కోసం ఆశతో వెళ్లిన ఓ బీసీ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన జియో ఆఫీస్ మేనేజర్ మధుకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ SI విజయ్ తెలిపారు. సోమవారం నిందితుడు మధుకర్ రెడ్డిని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్‌తో జియో ఆఫీస్‌ను ముట్టడిస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెందిన రవి ముదిరాజ్ పేర్కొన్నారు.

February 28, 2026 / 02:46 PM IST

భూ భారతి స్కామ్‌పై హరీష్ రావు ఆరోపణలు

WGL: భూ భారతి స్కామ్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి మొదలు మండల స్థాయి అధికారుల వరకు కలిసి దళారులతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు  కోట్ల రూపాయాలు నష్టం జరుగుతున్నా CM స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ధరణిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు భూ భారతి స్కామ్‌తో ప్రభుత్వానికి గండి కొడుతోందని అన్నారు.

February 28, 2026 / 02:45 PM IST

వైరా మున్సిపాలిటీని మోడల్ గా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

KMM: వైరా మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. శనివారం వైరా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ కాపా చంద్రకళ అధ్యక్షతన పాలకవర్గం సాధారణ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

February 28, 2026 / 02:41 PM IST

పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన ఎస్సై

NRPT: ఇంటర్ పరీక్ష కేంద్రాలను శనివారం ఎస్సై వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం వద్ద భద్రత సిబ్బందితో మాట్లాడి పరీక్ష జరుగుతున్న సరళిని అడిగి తెలుసుకున్నారు. వంద మీటర్ల దూరం వరకు ప్రజలు గుంపులుగా ఉండకుండా చూడాలని, హాల్ టికెట్ లేకుంటే లోపలికి అనుమతించరాదని చెప్పారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని చెప్పారు.

February 28, 2026 / 02:39 PM IST

విద్యార్థుల సైన్స్ ప్రతిభకు ప్రశంసలు

WNP: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పానగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సైన్స్ ఫేర్ జరిగింది. హెచ్ఎం నాగలీల ఆధ్వర్యంలో, ఎంఈవో ఆనంద్, కమ్యూనిటీ అధికారి ప్రతాప్ రెడ్డి ప్రారంభించిన వేడుకలో విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీలించి అభినందించారు.

February 28, 2026 / 02:37 PM IST