WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఛైర్మన్ సారంగపాణి అన్నారు. వర్ధన్నపేట 2, 7వ వార్డులో ఛైర్మన్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డును అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఛైర్మన్ తెలిపారు.
MNCL: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండల పంచాయతీ అధికారి ములకల సత్యనారాయణ మృతి చెందారు. బైక్‌పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఆయన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం, ట్రస్మా ప్రైవేట్ విద్యాసంస్థల తరపున మున్సిపల్ ఛైర్మన్ మైలారం లింబాద్రి, వైస్ ఛైర్మన్ ఓంకారి నవీన్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రైవేట్ విద్యాసంస్థల పట్టణ అధ్యక్షులు ప్రదీప్ గౌడ్, సెక్రెటరీ శేఖర్, ట్రెజర్ రాజకుమార్, రామారావు, దొంతల రాజ్ కుమార్, మహర్షి, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్‌ను ఆన్లైన్ ద్వారా తమ నమోదును సులభంగా తెలుసుకోవచ్చని హన్వాడ మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఆన్లైన్లో రైతులు ఈ లింక్ https://tlfr.agristack.gov.in/farmer-registry-tl/#/checkEnrolmentStatus ను ఓపెన్ చేసి ఆధార్ నెంబర్‌ను నమోదు చేస్తే రైతు పేరు, రైతు ఐడి నెంబర్, అప్రూవ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చని అన్నారు.
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సతీష్ టైలర్ షాప్‌లో యువ నాయకుడు దాగేటి ఉదయ్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టైలర్ వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
BHPL: మున్సిపాలిటీ 6వ వార్డు క్రిష్ణాకాలనీలో శనివారం వార్డు కౌన్సిలర్ రేణుక-గణపతి ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందితో కాలనీలో పేరుకుపోయిన చెత్తను ఎత్తించి, బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.. వార్డును ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.
KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై గత కేసిఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి మాట్లాడారు. ప్రజల తిరుగుబాటు చూసి ఆనాడు కేసీఆర్ వెనుకడుగు వేశారని, కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇళ్లు కూల్చడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
KMM: ఖమ్మం 19వ డివిజన్ అల్లిపురం- కొత్తగూడెం రోడ్డులో శనివారం సైడ్ డ్రైన్ నిర్మాణానికి కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ శంకుస్థాపన చేశారు. సీసీ డ్రైన్స్ లేకపోవడం కారణంగా డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో సీసీ డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
KMM: నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకులు జాటోత్ మధునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యులు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
BHNG: మేడారం తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ చామల స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలపై ఇవాళ గాంధీభవన్ ప్రెస్ మీట్‌లో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూమిని, ప్రజావసరాల దృష్ట్యా తాగునీటి రిజర్వాయర్ కోసం వెనక్కి తీసుకుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి పనులను శనివారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణంలోని నాణ్యతను గమనించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.
HNK: “ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అనే మదర్ థెరిసా సూక్తిని ప్రస్తావిస్తూ, గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం బాలవికాస ప్రధాన లక్ష్యమని MLA నాగరాజు అన్నారు. HNKలో ఇవాళ నిర్వహించిన బాలవికాస తాగునీటి శుద్ధీకరణ పథక కమిటీల మహాసభలో పాల్గొన్న ఆయన, చెరువుల పూడికతీత, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో శనివారం జరిగిన సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షలో జూనియర్ కళాశాలలో 285 విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరు, ఆదర్శ కళాశాలలో 145 విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరైనట్లు ఇరు కళాశాలల ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాస్ తెలిపారు. మొత్తంమీద పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు వారు సూచించారు.
MNCL: మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో నిర్వహిస్తున్న సూర్యతేజ పారామెడికల్, లక్ష్మి నర్సింగ్ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విద్యా సంస్థల్లో చేరి విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
SRD: ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్ఐ దశరథ్, ఏఎస్ఐ యాదగిరిలను ఎస్పీ కార్యాలయంలో శనివారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో అనేక సంవత్సరాలు పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏవో కల్యాణి, ఏఆర్ డీఎస్పీ నరేందర్ పాల్గొన్నారు.