• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వీడ్కోలు సమావేశంలో పూర్వ కలెక్టర్

KNR: జిల్లా కలెక్టర్‌గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

March 3, 2026 / 11:09 AM IST

నాడు సమాజ సేవకులు నేడు ప్రజా సేవకులు

WNP: మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్‌లో కీలక పాత్ర పోషిస్తు నాడు సామాజిక సేవలో భాగస్వాములై, అభాగ్యులైన ఎందరికో మేమున్నామంటూ చేయుతనందించింది. నేడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, గనగాని శైలజ నర్సయ్య గౌడ్‌లకు శ్రీ రామలింగేశ్వర ఆలయ ఆవరణలో సన్మానం చేశారు.

March 3, 2026 / 11:04 AM IST

కంబాపూర్‌లో హోలీ వేడుకలు

KMR: పిట్లం మండలం కంబాపూర్ గ్రామంలో మంగళవారం హోలీ పండుగను వైభవంగా జరుపుకున్నారు. రంగుల కేళిలో చిన్నారులు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచే వీధుల్లోకి చేరిన గ్రామస్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, అందరూ కలిసిమెలిసి హోలీ సంబరాలను ఆస్వాదించారు.

March 3, 2026 / 11:02 AM IST

పొనుగోడులో హోలీ వేడుకలు

NLG: కనగల్ మండలం పొనుగోడులో హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. గ్రామ యువకులు, పెద్దలు కులమతాలకు అతీతంగా రంగుల కేళిలో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ వాతావరణంతో గ్రామంలో సందడి నెలకొంది. స్నేహితులు, బంధువుల కలయికతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

March 3, 2026 / 11:01 AM IST

ఆంజనేయ స్వామి ఆలయం మూసివేత

MDK: శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కుల గ్రామ శివారులోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయం మూసివేశారు. ఈరోజు చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ద్వార బంధనం నిర్వహించారు. రేపు ఉదయం ఏడు గంటలకు శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి భక్తుల దర్శనాలు ప్రారంభిస్తామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.

March 3, 2026 / 11:01 AM IST

పిల్లలను ఆకట్టుకుంటున్న రంగురంగుల వస్తువులు

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో హోలీ పండుగ సందడి మొదలైంది. మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద న్యాచురల్ రంగుల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. వివిధ రకాల రంగులు, పిచుకారులు, పిల్లల కోసం ప్రత్యేక వస్తువులతో వ్యాపారులు ఆకట్టుకుంటున్నారు. హోలీ సందర్భంగా కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిటలాడుతోంది.

March 3, 2026 / 10:54 AM IST

బాత్‌రూమ్‌లో మైనర్ బాలిక ప్రసవం

నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ కేంద్రంలోని మూత్రశాలలో మైనర్ ప్రసవించిన ఘటన కలకలం రేపింది. పుట్టిన శిశువును చెత్తబుట్టలో వేయడానికి బాలిక తల్లి ప్రయత్నించగా సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాలింతను, శిశువును పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై భరోసా కేంద్రం నిర్వాహకులు చేపట్టారు.

March 3, 2026 / 10:52 AM IST

డ్రైనేజీ లేని దుస్థితి.. ఇబ్బందుల పడుతున్న ప్రజలు..!

ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే చేరి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు నిల్వ ఉండటంతో ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారి రహదారులు నడవలేని స్థితికి చేరుతుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కొరారు.

March 3, 2026 / 10:47 AM IST

‘ఎంఈవోపై చర్యలు తీసుకోవాలి’

RR: చౌదరిగూడపరిధిలోని ఓ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్‌ను MEO స్టేటస్ పెట్టడాన్ని ఖండిస్తున్నామని SFI RR జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటేషన్ పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేటు స్కూలుకు MEO వత్తాసు పలికితే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఏ విధంగా నమ్ముతారన్నారు. MEOపై చర్యలు తీసుకోవాలన్నారు.

March 3, 2026 / 10:47 AM IST

హోలీ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ

NRML: నిర్మల్ పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి, అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితం రంగుల మయంగా ఉండాలని ఈ పండుగ అందరి జీవితాల్లో రంగులు పూయాలని తెలిపారు.

March 3, 2026 / 10:45 AM IST

కొత్త పద్ధతులపై రైతులకు అవగాహన

MBNR: గండీడ్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఏవో జీ. రాధమ్మ ఆధ్వర్యంలో ఆత్మ సహకారంతో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన సదస్సు జరిగింది. ఏఈవోలు సమత, వరలక్ష్మి, శివలీల, గౌతమి పాల్గొని పంటల దిగుబడి పెంపు, ఎరువుల సమతుల్య వినియోగం, వ్యాధి నియంత్రణపై సూచనలు ఇచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు.

March 3, 2026 / 10:44 AM IST

‘రైతు భరోసా వెంటనే ఇవ్వాలి’

KMM: యాసింగి పంటల సాగుకు ప్ర‌భుత్వం వెంట‌నే రైతు భరోసా అందివ్వాల‌ని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. మంగళవారం రైతు సంఘం, సీపీఐ(యం) ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో నిరసన చేపట్టారు. యాసింగి సమయం అయిపోతున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు.

March 3, 2026 / 10:38 AM IST

తన పొలానికి వెళ్లాలంటే కెనాల్ దాటాల్సిందే..!

MHBD: తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చెందిన దాసరి వెంకట్ రెడ్డి సాగు భూమి ఎస్సారెస్పీ డీబీఎం -57 కెనాల్ పక్కనే ఉంది. సాధారణంగా కెనాల్‌కు ఇరువైపులా రాకపోకలకు దారి ఉండాలి. కానీ ప్రస్తుతం ఒకవైపు మాత్రమే ఉంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. తన పొలానికి వెళ్లాలంటే కెనాల్ కాలువ దూకాల్సి వస్తుందన్నారు.

March 3, 2026 / 10:38 AM IST

ఘనంగా హోలీ పండుగ వేడుకలు

SDPT: కోహెడ మండలంలోని పలు గ్రామాలలో హోలీ పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గ్రామాలన్నీ రంగుల హరివిల్లుగా మారగా, చిన్నారులు, యువకులు, పెద్దలు కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంగులు చల్లుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామాల్లో పండుగ సందడి, హర్షోత్సాహాలు వెల్లివిరిశాయి.

March 3, 2026 / 10:37 AM IST

తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు

VKB: తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా ఉన్న సాయిపూర్ బాల్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలును మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

March 3, 2026 / 10:35 AM IST