• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

KNR: గంగాధర మండల కేంద్రంలో వరి పంట పొలాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్ పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ముందు జాగ్రత్తగా ఐసొప్రోత్రయోలిన్ 1.5ml /లీటర్ నీటికి లేదా కాసుగా మైసిన్ 2ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

March 3, 2026 / 08:23 AM IST

‘వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి’

HNK: వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పైప్‌లైన్ల లీకేజీలను తక్షణమే అరికట్టాలని, రిజర్వాయర్లలో నీటి స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

March 3, 2026 / 08:21 AM IST

వికారాబాద్‌లో మహిళా దారుణ హత్య

VKB: నవాబ్‌పేట మండలం ఎల్లకొండ సమీపంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణిని(45) గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

March 3, 2026 / 08:18 AM IST

చంద్రగ్రహణం ఎఫేక్ట్.. భీమేశ్వర ఆలయం మూసివేత

SRCL: చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసి వేశారు. ఆలయ అర్చకులు వేకువ జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణం ముగిసి న అనంతరం సాయంత్రం 7.15 గంటలకు పుణ్యాహవచనం నిర్వహిం చి, ఆలయం అంతట సంప్రోక్షణ చేపట్టి, తెరుస్తామన్నారు.

March 3, 2026 / 08:17 AM IST

‘రైతులకు ఫార్వర్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

పెద్దపల్లి: మండలంలోని అందుగులపల్లి గ్రామ రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉపసర్పంచ్ స్వప్న అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.

March 3, 2026 / 08:16 AM IST

హోలీ శుభాకాంక్షలు తెలిపిన.. మంత్రి

MLG: హోలీ పండుగ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు, అధికారులకు రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. రసాయనిక రంగులు వాడకుండా సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగించాలని, ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు నిర్వహించాలని కోరారు.

March 3, 2026 / 08:15 AM IST

రోజుల పాటు ఆరోగ్య కార్యక్రమలు: DMHO

ADB: భారత ప్రజారోగ్య ప్రమాణాల హామీల అమలులో భాగంగా 100 రోజుల పాటు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DMHO నరేందర్ రాథోడ్ తెలిపారు. ఆదిలాబాద్ DMHO కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 4న ప్రారంభంకానున్న 100 రోజుల ఆరోగ్య కార్యక్రమాల వివరాల MLHP, MOలు, పర్యవేక్షణ సిబ్బందికి శిక్షణ అందించారు.

March 3, 2026 / 08:12 AM IST

అవినీతికి స్వస్తి పలకాల్సిందే: కేంద్ర మంత్రి

KNR: ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ కరీంనగర్ మున్సిపల్ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతికి స్వస్తి పలకాలని, నిబంధనల ప్రకారం ఇళ్ల అనుమతులు సులభతరం చేయాలని ఆయన ఆదేశించారు. నిజాయితీగా పనిచేసే వారికి అండగా ఉంటానని, హామీ ఇచ్చారు.

March 3, 2026 / 08:12 AM IST

చంద్రగ్రహణ వేళ జమ్ములమ్మ సన్నిధి మూసివేత

GDWL: గ్రహణ కాలంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేయడం సంప్రదాయం అని ఆలయ ఈవో పురందర్ కుమార్ పేర్కొన్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకే గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత, బుధవారం తెల్లవారుజామున 6 తెరుస్తామన్నారు.

March 3, 2026 / 08:11 AM IST

దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్

MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో సర్పంచ్ ఉల్లి నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో లార్వా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని కాలువలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో లార్విసైడ్ మందులను పిచికారీ చేయించారు. వారం రోజుల పాటు సాగే ఈ డ్రైవ్లో భాగంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 3, 2026 / 08:08 AM IST

షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో సీపీ తనిఖీ

RR: షాద్‌నగర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనతో పోలీస్ సేవలపై స్పష్టత పెరిగింది.

March 3, 2026 / 08:08 AM IST

రైతుకు వందనం కార్యక్రమంలో అవార్డు

WNP: రైతు దేశానికి వెన్నెముక అని, సాగు లేకపోతే మానవ సమాజానికి మనుగడ లేదని డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ సాయి అఖిల ట్రస్ట్ రూపొందించిన ‘రైతుకు వందనం’ పాట వండర్ రికార్డు సాధించిన సందర్భంలో ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రాజవర్ధన్ రెడ్డి ‘ఉత్తమ రైతు’ పురస్కారాన్ని అందుకున్నారు.

March 3, 2026 / 08:07 AM IST

జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ

KMR: హోళీ పండుగను పురస్కరించుకుని జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలన్నారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలాషించారు.

March 3, 2026 / 08:04 AM IST

కోతుల బెడద నివారణ వినూత్న ప్రయోగం

SDPT: కోహెడ మండలం నకిరేకొమ్ములలో కోతుల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామస్థులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. పంటలను నాశనం చేస్తూ, ఇళ్లలోకి చొరబడుతున్న కోతులను తరిమికొట్టేందుకు ఓ వ్యక్తికి ఎలుగుబంటి వేషధారణ వేయించి ఊరంతా తిప్పారు. ఎలుగుబంటిని చూసి కోతులు భయంతో పారిపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్య పరిష్కారానికి ఇది తాత్కాలిక మార్గమన్నారు.

March 3, 2026 / 08:02 AM IST

ఓల్డ్ సిటీలో వేడుకగా కామ దహనం

నల్గొండ పాతబస్తీలోని షేర్ బంగ్లా ప్రాంతంలో కాముని దహన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక సంతోషి మాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం అగ్నిని వెలిగించి కామదహనం చేశారు. రంగుల పండుగకు ముందు నిర్వహించే ఈ వేడుకలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

March 3, 2026 / 08:01 AM IST