SDPT: జిల్లాలో గ్రూప్-2 పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసి అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి పంపించారు. పోలీసులు భారీ బందోబస్తును పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచారు.
MDK: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షల విధుల్లో సంబంధిత శాఖల అధికారులు నిమగ్నమై ఉన్నందున ప్రజావాణికి అందుబాటులో ఉండరని తెలిపారు. ప్రజలందరూ కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
HYD: మొయినాబాద్ మండల కేంద్రంలోని గణేశ్నగర్ కాలనీలో శనివారం రాత్రి దొంగ హల్చల్ చేశాడు. ఆటో దొంగతనం చేసి తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. పారిపోయేందుకు యత్నించగా పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకి అప్పగించారు. గత కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు వీధుల్లో తిరుగుతున్నారని, చోరీలు చేస్తున్నారని స్థానికులు తెలిపారు.
MDK: ఈనెల 19న ఢిల్లీలో జరగనున్న ఎన్విరాన్‌మెంట్ సదస్సుకు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ హాజరుకానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 20 మంది మున్సిపల్ కమిషనర్లకు ఆహ్వానం అందిందన్నారు. అందులో భాగంగా జిల్లా నుంచి తూప్రాన్ కమిషనర్ గణేష్‌కు ఆహ్వానం దక్కిందన్నారు. ఢిల్లీలో నిర్వహించే సదస్సులో పర్యావరణం సంబంధించిన అంశాలపై కమిషనర్లకు అవగాహన కల్పించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందుండాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని యాదవ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని యాదవ భావన నిర్మాణానికి 5 లక్షల విరాళం అందజేశారు.
KMR: పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగులు పుస్తెల తాడు అపహరించుకుని పారిపోయినట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అశోక్ నగర్‌కు చెందిన భాగ్యమ్మ శనివారం కాలనీలోని కిరాణా షాపుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ADB: నేరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యువకులు రాజకీయాల్లో ఉండాలని భవిష్యత్తు యువకులదే అని అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నాయకులు దేవేందర్ రెడ్డి, లవ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
HYD: అంబర్ పేటలోని 6 నంబర్ చౌరస్తా వద్ద రోడ్డు మరీ అధ్వానంగా మారింది. ఇటీవల సిబ్బంది మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. నామమాత్రపు మరమ్మతులు చేపట్టడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి నూతన రోడ్డు వేసేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
KMM: ఈరోజు, రేపు నిర్వహించనున్న గ్రూప్ -2 పరీక్ష రాయబోయే అభ్యర్థుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు అన్ని డిపోలో పరిధిలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గ్రూపు 2 అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు దగ్గర ఉండి ఆపరేషన్‌ని పరిశీలిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం కొండ చుట్టూ ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం కొండ చుట్టూ ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
HNK: కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి కన్నుమూశారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ అధ్యాపకుడు ఆయన కొన్నేళ్లు బోధించారు. అనారోగ్యం కారణంగా నేడు తెల్లవారు జామున మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని షాషాబ్ గుట్ట ప్రాంతంలోని అల్ కౌసర్ మదర్స ఏరియాలో రూ.15.75 లక్షలతో నిర్మించనున్న మరుగుదొడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
NLG: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కు మంచి స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల ప్రాంగణాలలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లలో మొత్తం1,44, 358 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ నాగరాజు తెలిపారు. కాగా, బాధితులకు రూ.4.9 కోట్ల పరిహారం అందించేందుకు ప్రతివాదులు అంగీకరించినట్లు తెలిపారు.
WGL: ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకతరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఐనవోలు మండలం రాంనగర్ శివారు ఆకేరువాగు నుంచి అనుమతులు లేకుండా ఆరు ట్రాక్టర్లలో ఇసుకను వరంగల్ నగరానికి తరలిస్తుండగా వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకొని, పోలిస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.