KMM: ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఐఎన్టీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ విప్లవ కుమార్ కోరారు. ఈమేరకు శుక్రవారం ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొల్లిని నాగరాజు ఉన్నారు.
KMM: మండలంలో ఇటీవల ఓ వృద్ధ దంపతులను అతికిరాతకంగా దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు CP సునీల్ దత్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఐ సంజీవరావు ఈనెల 12న వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు చెప్పారు.
JGL: రూరల్ మండలం పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
NRML: ఆధునిక వ్యవసాయ పద్ధతులలో భాగంగా నానో యూరియా, డీఏపీలపై శుక్రవారం సోన్ మండల కేంద్రంలో డ్రీమ్ సొసైటీ కో-ఆర్డినేటర్ చిన్నయ్య రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల అధిక దిగుబడి సాధ్యమవుతుందని తెలిపారు.
KMR: కామారెడ్డి విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఇంటర్ కాలేజీ టోర్నమెంట్‌లో సత్తా చాటారు. మర్కల్ మహిళా డిగ్రీ కళాశాలలో MSDS ప్రథమ సంవత్సరం చదువుతున్న సి. హెచ్. వైష్ణవి డిస్కస్ త్రో లో గోల్డ్ మెడల్ సాధించారు. BZC తృతీయ సంవత్సరం చదువుతున్న పి. శ్రీవిద్య జావేలిన్ త్రో లో సిల్వర్ మెడల్ సాధించింది.
NLG: డిండి మండల పరిధిలోని డిండి PWD రోడ్డు నుండి రాస్య తండా గ్రామం వరకు నూతనంగా ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
KNR: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ కార్యక్రమం నగరంలోని లక్ష్మీనగర్‌లోనీ కేఈఎస్ గార్డెన్‌లో జరిగింది. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ ఆఫీసర్లు ఆరోగ్య మహిళ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అన్నారు.
KNR: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి అన్నారు. తిమ్మాపూర్ మండల ప్రజలకు 108 అంబులెన్స్ సేవలు చేరువయ్యాయని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంజూరైన అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి&షాదిముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని సంవత్సరం కాలం గడుస్తున్న తులం బంగారానికి మోక్షం కలుగలేదని ఏద్దేవా చేసారు.
MBNR: చిన్న రాజమూర్ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. దేవరకద్ర ఎమ్మార్వో ఆఫీస్‌లో అధికారులతో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
NZB: మోస్రా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మించిన యోగా కేంద్రాన్ని శుక్రవారం ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్, మాజీ జడ్పీటీసీ గుత్ప భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. మండల ప్రజలు యోగా కేంద్రాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు.
జనగామ: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రేపు శనివారం మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించనున్నట్లు పీఆర్వో కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పెద్ద పెండ్యాల శివారులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరుగు వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించనున్నారు. కరుణాపురం బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో నూతన మెనూ అమలు చేయనున్నారు.
NZB: విద్యార్థిని కొట్టిన ఘటనలో టీచర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్‌లో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని తప్పు చేస్తే మందలించాల్సింది పోయి తీవ్రంగా దండించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు దేవిక, మనోజ్, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
MNCL: దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను లక్షెట్టిపేట కోర్టు అధికారులు, శుక్రవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. అదే రేంజ్‌లో పనిచేస్తున్న బియ్యాల అంజన్నను అధికారులు తొలగించడంతో, గోదావరిఖనిలోని లేబర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. అధికారులు కోర్టు ధిక్కరణ చేయడంతో ఫర్నిచర్‌ను కోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
WGL: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి, సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, తదితర విషయాలపై కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.