• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభించండి: MP

SDPT: జిల్లాలో నూతనంగా నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ను త్వరగా ప్రారంభించాలని MP రఘునందన్ రావు కోరారు. ఈ విషయమై రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌తో కలిసి వినతిపత్రం ఇచ్చారు. అలాగే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ను టర్మినల్‌గా అభివృద్ధి చేయాలని కోరారు.

March 13, 2026 / 11:28 AM IST

రైతులకు సబ్సిడీ పై జిప్సం పంపిణీ: AO

BHPL: మొగుళ్లపల్లి మండలంలోని రైతులకు సోడిక్, లవణ నేలల సమస్య తగ్గించి పంట దిగుబడి పెంచేందుకు 90 శాతం రాయితీపై జిప్సం అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక టన్ను జిప్సం ధర రూ.5,660 కాగా, రైతులు కేవలం 10 శాతం అంటే రూ.566 మాత్రమే చెల్లించాలన్నారు. ఆసక్తిగల రైతులు AO కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

March 13, 2026 / 11:26 AM IST

రేపు జిల్లాలో పర్యటించనున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మెన్

NRML: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య రేపు జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. బాసర ఐఐఐటీలో నిర్వహించే సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో పాల్గొని, అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దర్శనం చేసుకుంటారు. 15న కరీంనగర్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి సిద్దిపేటకు బయలుదేరుతారని వారు తెలిపారు.

March 13, 2026 / 11:26 AM IST

‘దేవరకొండలో రోల్ మోడల్‌గా 16వ వార్డు’

దేవరకొండ పట్టణంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 16వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కౌన్సిలర్ కేతావత్ రూప్లా నాయక్ అన్నారు. ఇవాళ అధికారులతో కలిసి పర్యటించిన ఆయన వెంకటేశ్వర థియేటర్, విద్యోదయ స్కూల్ పరిసరాల్లోని డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని పేర్కొన్నారు.

March 13, 2026 / 11:25 AM IST

జాతీయ రహదారుల పనుల కోసం కేంద్రమంత్రిని కలిసిన MLA

ASF: కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని న్యూ ఢిల్లీలోని అధికారిక నివాసంలో సిర్పూర్ MLA హరీష్ బాబు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి-గడ్చిరోలి నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం విషయంలో అలైన్‌మెంట్ ఖరారు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్-నాగ్ పూర్ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని కోరారు.

March 13, 2026 / 11:25 AM IST

‘పేదల కల నెరవేరింది’

SRCL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో నిరుపేదల కల నెరవేరిందని ఏఎంసీ డైరెక్టర్ కలిపెల్లి తిరుపతిరెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో నగునూరి లతా శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

March 13, 2026 / 11:24 AM IST

వార్డు ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం: వైస్ చైర్ పర్సన్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీలోని 13వ వార్డులో దోమల బెడద నివారణకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ రమ-నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు ప్రత్యేక ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వార్డులోని పలు వీధులు, కాలువలు, ఇతర ప్రాంతాల్లో ఫాగింగ్ చేశారు. వార్డు ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని వైస్ చైర్ పర్సన్ తెలిపారు.

March 13, 2026 / 11:23 AM IST

అంగన్వాడీలో పోషకాహారాలు పక్కదారి..!

VKB: యాలాల మండలం అన్నాసాగర్ గ్రామ అంగన్వాడీ టీచర్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వం పంపించే పోషక పదార్థాలు గర్భిణులు, బాలింతలకు పూర్తిగా ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపించారు. పదార్థాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో మండిపడుతున్నారు. అంగన్వాడీ టీచర్‌పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

March 13, 2026 / 11:21 AM IST

INTUC కార్మిక సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరణ

​NLG: దేవరకొండలో ఏప్రిల్ 4న జరగనున్న INTUC సదస్సు కరపత్రాన్ని ఇవాళ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం INTUC నిరంతరం పోరాడుతుందని ఆయన కొనియాడారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడం కార్మికుల జీవన ప్రమాణాల పెంపుపై ఈ సదస్సులో చర్చిస్తామని తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

March 13, 2026 / 11:15 AM IST

మాజీ ఎమ్మెల్యే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు

JN: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి MLA కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. దీంతో మాజీ MLA, స్టేషన్ ఘనపూర్ BRS ఇంచార్జ్ డాక్టర్ తాటికొండ రాజయ్య చిల్పూర్‌కు వెళ్తుండగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

March 13, 2026 / 11:09 AM IST

బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’కు సవాళ్లు..!

KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈనెల 14న చేపట్టనున్న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’లో భాగంగా KNR నుంచి కొండగట్టు వరకు సాగే 40 కి.మీ పాదయాత్రపై భానుడి ప్రతాపం, ట్రాఫిక్ చిక్కుల ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఆరోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం, అదే రోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు సవాలుగా మారనున్నాయి.

March 13, 2026 / 11:08 AM IST

‘కూరగాయల విత్తన కిట్లను సద్వినియోగం చేసుకోవాలి’

ADB: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న కూరగాయల విత్తన కిట్లను రైతులు వినియోగించుకోవాలని HEO గణేష్ కోరారు. శుక్రవారం పూసాయి గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులకు సుమారు రూ. 500 విలువైన టమాటా, బెండ, మిరప, ఆకుకూరల మినీ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. రైతులు తమ ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను స్వయంగా పండించుకోవాలన్నారు.

March 13, 2026 / 11:07 AM IST

నడిగూడెంలో యువజన నాయకుల ముందస్తు అరెస్ట్

SRPT: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసిన యువజన, విద్యార్థి సంఘాల నాయకులను నడిగూడెం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తున్నందుకు జమ్మి ఎల్లయ్య (DYFI), కామల్ల ప్రవీణ్ (DYFI), మేకల వీరబాబు (TRSV), పందిటి నవీన్ (MRPS) తదితరులను అదుపులోకి తీసుకోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 13, 2026 / 11:05 AM IST

కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్

MDK: నిజాంపేట మండలం చల్మెడలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా బొమ్మెన శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా కాకి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా మహిపాల్, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, సలహాదారుగా మల్లేశం ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

March 13, 2026 / 11:04 AM IST

ఇటుకబట్టీలో వలస కూలీ మృతి

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులోని ఇటుకబట్టీలో పనిచేస్తున్న వలస కూలీ రంజిత్ వైద్యనాథ్ (20) అనుమానాస్పదంగా మృతిచెందాడు. మహారాష్ట్రకు చెందిన అతడు కుటుంబ గొడవలతో మద్యం తాగి అర్ధరాత్రి ఉరేసుకున్నట్లు సమాచారం. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.

March 13, 2026 / 11:03 AM IST