KNR: తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో గుర్తుతెలియని జంతువులు రైతు గడ్డం శ్రీనివాస్‌కు చెందిన లేగ దూడపై దాడి చేశాయి. ఈ దాడిలో దూడ తీవ్రంగా గాయపడింది. ఘటనపై ఫారెస్ట్, వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. దాడి చేసిన జంతువులను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రో జిఎన్ శ్రీనివాస్ పీజీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్కర్లు సమయపాలన పాటించాలని, గ్రాసరీస్ నాణ్యత, ఎక్స్ పైరీ డేట్ పరిశీలించాలని సూచించారు. విద్యార్థులు హాస్టల్ సౌకర్యాలను సక్రమంగా వినియోగించుకుని తరగతులకు క్రమంగా హాజరు కావాలని తెలిపారు.
WNP: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించే అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ఇవాళ జిల్లాలోని ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలను సందర్శించి పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను, పరీక్షల నిర్వహణను, పరీక్షలకు సంబంధించిన కొశ్చన్ పేపర్ అకౌంట్, అనెగ్జర్స్ మొదలైన రికార్డులను పరిశీలించారు.
HNK: హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా కాజీపేటకు చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు పార్టీ శ్రేణులతో ఎమ్మెల్సీ మల్లన్న చర్చించారు. రాజ్యాధికార పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.
MNCL: వార్డులో వ్యాధులు ప్రబలకుండా నివారణపై దృష్టి సారించామని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఐదో వార్డులోని వివిధ కాలనీలలో మున్సిపల్ కార్మికుల చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీలు చెత్తతో నిండిపోతే దోమల బెడద పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.
SRD: ఆరోగ్యవంతమైన జీవితం కోసం వ్యాయామం తప్పనిసరని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి అన్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ కార్యాలయంలో ఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, సొంత వైద్యాన్ని తీసుకోరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో బాలరాజు పాల్గొన్నారు.
మెదక్: నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ నరేందర్ ఆధ్వర్యంలో 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో పారిశుధ్య పనులను పర్యవేక్షించి, దోమల నివారణకు పరిసరాలను పొడిగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్థులకు వివరించారు.
NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరగాల్సిన నిరుద్యోగ ధర్నాకు వెళ్లకుండా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్‌ను దేవరకొండ పోలీసులు శుక్రవారం ఉదయం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేమని నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరగాల్సిన నిరుద్యోగ ధర్నాకు వెళ్లకుండా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్‌ను దేవరకొండ పోలీసులు శుక్రవారం ఉదయం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేమని నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MNCL: హజీపూర్ మండలంలోని హజీపూర్ బస్టాండ్ వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరీమణులకు శుక్రవారం మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ శాంతి, సామరస్యానికి ప్రతీక అన్నారు. ముస్లీం ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
GDWL: వార్డు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు గద్వాల మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ కమ్మరి సునీత రాము పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వార్డులోని వివిధ కాలనీల్లో మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీలు తొలగించారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ చెత్త వాహనాల్లో వేసి పరిశుభ్రతకు సహకరించాలన్నారు.
KNR: రాష్ట్ర మున్నూరు కాపు సంఘం (పటేల్) మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన పురెళ్ల సరోజ పటేల్ నియామకమయ్యారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు.
WNP: వనపర్తి బండారు నగర్ మున్నూరు కాపు భవన్‌లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ‘గాంధేయ మార్గంలో సామ్యవాదం’ అంశంపై CSD & JVV ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతుందని డాక్టర్ మురళీధర్ చెప్పారు. ఈ కర్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య బాల మోహన్ దాస్, అతిథులుగా జెవీవీ వ్యవస్థాపకులు బ్రహ్మారెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు.
WGL: జిల్లాకు చెందిన డా. వన్నాల వెంకటరమణను BJP తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన డా. వెంకటరమణ తన సేవలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.
HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 12,079 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారని, దీనికి 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.