మెదక్: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో సర్పంచ్ మస్కూరి బాలరాజు, కార్యదర్శి మాధవి ఆధ్వర్యంలో ‘డ్రై డే-ఫ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుధ్య మెరుగుదల, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తూ, గ్రామంలో నిల్వ ఉన్న నీటిని తొలగించేలా ప్రజలను చైతన్య పరిచారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన సంక్షేమ పథకాల ప్రాముఖ్యతపై వివరించారు.
MDK: టేక్మాల్ మండలం కద్దులూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పులర్ నుంచి అల్లాదుర్గ్ పరీక్షా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని 108 సిబ్బంది మహేష్ కుమార్, దుర్గయ్య ప్రథమ చికిత్స అందించి, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MLG: జీతం ఇవ్వలేదని ఓ డ్రైవర్ లారీని ఎత్తుకెళ్లిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. గోవిందరావుపేటకు చెందిన వ్యక్తి జీతం విషయంలో లారీ యజమానితో గొడవపడ్డాడు. భూపాలపల్లికి చెందిన లారీ యజమాని GPS ద్వారా లారీని ట్రాక్ చేసి ములుగు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. జిల్లా కేంద్రంలో పోలీసులు లారీని ఆపే ప్రయత్నం చేయగా… డైవర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
MLG: జీతం ఇవ్వలేదని ఓ డ్రైవర్ లారీని ఎత్తుకెళ్లిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. గోవిందరావుపేటకు చెందిన వ్యక్తి జీతం విషయంలో లారీ యజమానితో గొడవపడ్డాడు. భూపాలపల్లికి చెందిన లారీ యజమాని GPS ద్వారా లారీని ట్రాక్ చేసి ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా కేంద్రంలో పోలీసులు లారీని ఆపే ప్రయత్నం చేయగా… డ్రైవర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
BHPL: జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకులు కోసం FSSAI లైసెన్స్& రిజిస్ట్రేషన్ మేళా మార్చి 16న నిర్వహించనున్నట్లు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. ఈ మేళా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నెంబర్ F19లో ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతుందన్నారు. అవకాశాన్ని ఆహార వ్యాపార నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. నిజామాబాద్ నార్త్ మండల వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 3,270 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీటి పర్యవేక్షణ కోసం 13 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 160 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.
SDPT: చెరువులు, కుంటల్లో చెత్త వేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ ఛైర్‌పర్సన్ చందన అన్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఆమె పాండవుల చెరువు శుభ్రత కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
RR: చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామపంచాయతీ ఆరవ వార్డులో ఖాళీ ప్రదేశంలోని ముళ్ల చెట్లు పెరిగి చెత్త చెదారం నిండడంతో ఇబ్బంది పడుతున్నామని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి చెట్లను తొలగించి చెత్తను శుభ్రం చేయించారు. ప్రజలు విన్నవించిన సమస్యను వెంటనే పరిష్కరించడంతో గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
JGL: రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్ర శిక్షణకు వెళ్తున్న బస్సును శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా నరిమెట్టలో ఆయిల్ ఫేడ్ ఫ్యాక్టరీ సందర్శన, శిక్షణ, మార్కెటింగ్‌పై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.
GDWL: అలంపూర్ పట్టణంలోని వాసవి నిత్యాన్నదాన సత్రంలో రెండో అంతస్తులో నిర్మిస్తున్న కల్యాణ మండపానికి రూ.55,555 విరాళం అందజేశారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఇల్లూరు చలపతి శెట్టి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా సత్రం కమిటీ ఛైర్మన్, సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.
RR: బర్రెలు అపహరణకు గురైన ఘటన చౌదరిగూడ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాలు.. సీతారాములు అనే రైతుకు చెందిన ఏడు బర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పాడి వ్యాపారం మీద ఆధారపడ్డ కుటుంబసభ్యులు బర్రెలు అపహరణకు గురవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. బర్రెల జాడ తెలిస్తే తెలపాలని, ఆర్థికంగా నష్టాల పాలైన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
HNK: ఐనవోలు మండలంలోని పంథిని పశువైద్యశాలలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే అన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండలం ముస్కని పేటలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆవులు, ఎద్దులు, బర్రెలకు ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ పూర్ణచంద్రిక, వెటర్నరీ అసిస్టెంట్ లచ్చయ్య ఉన్నారు.
RR: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా షాద్ నగర్‌లోని గాంధీ నగర్‌లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రజలకు తడిచెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ఇళ్లల్లో, పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.
MDK: మనోహరాబాద్ మండలం పాలాట గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి టీకాల శిబిరాన్ని సర్పంచ్ సాయికుమార్ ప్రారంభించారు. పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రావణి మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.