MLG: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సన్నహాలు పూర్తి చేసినట్లు జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి హుస్సేని ఇవాళ తెలిపారు. జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా, 46 లక్షల గన్నీ బ్యాగుల కోసం 30.39 లక్షల బ్యాగులు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.