వనపర్తి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యాజమాన్యాలు ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సమస్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.