ADB: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కాంగ్రెస్ కార్యకర్తలపై నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బత్తుల రమేష్ పేర్కొన్నారు. సోనాల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో వ్యక్తులపై దాడుల సంస్కృతిని ఎమ్మెల్యే ప్రోత్సహించటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ముందుకు వెళ్లాలని సూచించారు.