JGL: హైదరాబాద్లోని నాగబాబు స్టూడియోలో మంగళవారం జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ, జాతీయ బ్లాక్ బెల్ట్ అవార్డు కార్యక్రమం జరిగింది. సినీ నటుడు సుమన్ జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నంకు చెందిన రాగి హర్షవర్థన్కు జాతీయ స్థాయి బెల్ట్ డిప్లోమాను అందజేసి అభినందించారు.