KMR: జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్‌గా రవికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు. మునుపటి డిపో మేనేజర్ సరితా దేవి హకీంపేట్ డిపోకు బదిలీపై వెళ్లగా, జీడిమెట్ల డిపో నుంచి ప్రమోషన్‌పై రవికుమార్ బాన్సువాడ డిపో బాధ్యతలు చేపట్టారు.