NZB: ఆలూరు ZPHS పాఠశాలకు చెందిన విద్యార్థి శ్రీనిత్ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయినట్లు ఫిజికల్ డైరెక్టర్ రాజేష్ తెలిపారు. క్రీడాకారుడిని HM & MEO నరేందర్ అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.