KMM: సత్తుపల్లి మండలం రేజర్లలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సామాజిక సేవకులు రమేష్, ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మొత్తం 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మందికి కంటి ఆపరేషన్ చేసేందుకు గుర్తించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మురళీకృష్ణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.