• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

లో-వోల్టేజ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

PDPL: రామగుండం 2వ డివిజన్ పరిధిలోని శాలపల్లి, జంగాలపల్లి గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఎన్పీడీసీఎల్ ఏఈ వంశీకృష్ణకు కార్పొరేటర్ వెంగళ బాబు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి ఏఈ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. 125 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని ఏఈ వంశీకృష్ణ హామీ ఇచ్చారని కార్పొరేటర్ వెంగళ బాబు వెల్లడించారు.

March 17, 2026 / 05:48 PM IST

పారిశుద్ధ్యంపై సంతృప్తి వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్

WGL: పర్వతగిరి మండల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వై.వి. గణేష్ మంగళవారం సందర్శించారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, పరిపాలన విధానాలు, నర్సరీ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ చీదురు శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:46 PM IST

మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం

BHPL: జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా SP సిరిశెట్టి సంకీర్త్ హాజరై మాట్లాడారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ అనుచిత చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్ శిక్షార్హ నేరమని, దీనికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 17, 2026 / 05:43 PM IST

కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల మహాధర్నా

NLG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18వేలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:41 PM IST

‘వృత్తి కులాలకు రూ.25 వేల కోట్లు కేటాయించాలి’

MNCL: రాష్ట్ర బడ్జెట్‌లో వృత్తి కులాలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. యాంత్రీకరణ, కార్పొరేట్ సంస్థల వల్ల వృత్తి కులాలపై ఆధారపడి జీవిస్తున్న 25 లక్షల మందికి ఉపాధి కరువైందని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి వారికి ఉపాధి కల్పించాలని కోరారు.

March 17, 2026 / 05:40 PM IST

‘జనగణనపై పూర్తిగా అవగాహనతో ముందుకెళ్లాలి’

KNR: జనగణన- 2027 కోసం ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు సూచించారు. 2027 జనగణనపై అధికారులకు కలెక్టరేట్‌లోని మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఈనెల 15 నుంచి చార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ అధికారులు, శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

March 17, 2026 / 05:37 PM IST

‘శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలు’

ADB: శ్రీ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ అన్నారు. ఇచ్చోడ మండలంలో నిర్వహించిన శ్రీ సరస్వతి విద్యాపీఠం 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. శిశు మందిరాల్లో చదువుతోపాటు వినయం, విధేయత, దేశభక్తి వంటి విషయాలను బోధించడం జరుగుతుందన్నారు.

March 17, 2026 / 05:36 PM IST

బ్యాటరీ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వరంగల్ రోడ్డుపై నిలిపి ఉన్న బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నగర శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో బ్యాటరీలను తరలిస్తున్న దొంగలను పట్టుకున్నట్టు వెల్లడించారు. బ్యాటరీల విలువ సుమారు రూ. 60,000 ఉంటుందని పేర్కొన్నారు.

March 17, 2026 / 05:31 PM IST

జిల్లా స్థాయికి 20 మంది విద్యార్థుల ఎంపిక

SRPT: హుజూర్‌నగర్ క్యాంపు హైస్కూల్‌లో నేడు మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు ముగిశాయి. ఎంఈవో సైదా నాయక్, హెచ్‌ఎం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో 22 మంది బాలురు, 18 మంది బాలికలు పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు ఎంఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:30 PM IST

‘రైతు భరోసాకు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి’

BHNG: యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసాను పొందేందుకు అర్హులైన రైతులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని AO శైలజ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 28, 2026 నాటికి కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్ పొంది, డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తయిన రైతులు, గతంలో ఏవైనా కారణాల వల్ల ఇప్పటివరకు రైతు భరోసా రాకున్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినయోగం చేసుకోవాలన్నారు.

March 17, 2026 / 05:30 PM IST

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పనులు 98% పూర్తి

HYD: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్ట్ రూ.35.61 కోట్లతో రూపుదిద్దుకున్నట్లు వివరించారు. రైల్వే శాఖలో ఇదొక ‘ఇంజనీరింగ్ మార్వెల్’ అంటూ కేంద్ర మంత్రి అభివర్ణించారు. త్వరలోనే మల్కాజ్‌గిరి, హైటెక్ సిటీ, హఫీజ్ పేట ప్రాంతాల్లో పునరుద్ధరించినట్లు తెలిపారు.

March 17, 2026 / 05:27 PM IST

సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్‌పై అవగాహన కరపత్రాల విడుదల

NZB: విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత కీలకమని TU వీసీ ప్రొ.టీ. యాదగిరి రావు అన్నారు. ఈనెల 25న PIB, సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రిజిస్ట్రార్ యాదగిరి, పలువురు ప్రొఫెసర్లతో కలిసి ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:25 PM IST

‘నీటి ట్యాంకుల నిర్మాణం వేగవంతం చేయాలి’

MNCL: అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత పథకం క్రింద చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

March 17, 2026 / 05:25 PM IST

ఘటన స్థలాన్ని పరిశీలించిన బడే నాగజ్యోతి

MLG: వాజేడు మండలం మోరుమూరు జీపీ పరిధి బొల్లారం గ్రామానికి చెందిన బాడిశ రాధకు చెందిన ఇళ్లు నిన్న రాత్రి ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ BRS ఇంఛార్జ్ బడే నాగజ్యోతి మంగళవారం బాధితుల నివాసానికి వెళ్లి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. బాధితురాలని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కొంత ఆర్థికసాయం అందచేశారు.

March 17, 2026 / 05:24 PM IST

దామెర MROకు వినతిపత్రం అందజేసిన నేతలు

HNK: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ.. దామెర MROకు బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

March 17, 2026 / 05:20 PM IST