PDPL: రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో మంగళవారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందితో కాలనీలను శుభ్రం చేశారు. డ్రైనేజీలలో ఉన్న మట్టిని తొలగించి, వర్షాకాలంలో వాన నీరు నిల్వ ఉండకుండా చదును చేశారు.
NLG: భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలను స్మరిస్తూ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలో విద్యార్థి, యువజన స్మారకోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 23 వరకు సాగే ఈ వేడుకల్లో భాగంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు మల్లం మహేష్, శంకర్ మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయ సాధన కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు.
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అమావాస్య, ఉగాది సందర్భంగా మార్చి 18, 19వ తేదీల్లో మార్కెట్ యార్డ్‌కు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్చి 20 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు గమనించి సహకరించాలని కోరారు.
HYD: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధి HYD, RR, MDCL, SGRD జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్లను మొదటి దశలో నిర్మించడం కోసం ప్రభుత్వం, రంగం సిద్ధం చేస్తుంది. ఈ మెరకు ప్రణాళికను రచిస్తున్నట్లుగా తెలిపింది. బహుళ అంతస్తుల్లో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని పలుమార్లు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
SRCL: ఆయిల్ ఫామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని, కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ఇల్లంతకుంట మండలం వంతడుపులలో మంగళవారం నిర్వహించిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు వస్తాయని తెలిపారు.
WGL: ఉమ్మడి జిల్లాలోని రేషన్ లబ్ధిదారులకు 3 నెలలకు సరిపడే బియ్యాన్ని ఒకేసారి అందజేయాలని అధికారులు నిర్ణయించారు. వేసవి ఎండల తీవ్రత కారణంగా కార్డుదారులు తరచూ క్యూలో నిలబడాల్సిన ఇబ్బందులు తప్పించడమే ఈ చర్య లక్ష్యమని తెలిపారు. అయితే 3 నెలల బియ్యాన్ని ఒకేసారి నిల్వ చేయడం కష్టమవుతుందని కొందరు రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం ఘటనలో పురోగతి లభించింది. వర్ని మండలం పైడిమల్ల గ్రామానికి చెందిన పాత్లావత్ జబ్బర్‌ను అధికారులు అరెస్టు చేశారు. చనిపోయిన చిరుత కళేబరం వద్ద చిరుత గోళ్లను కత్తిరించినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి నుంచి చిరుత పులి 10 గోళ్లును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
BDK: జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సాఫీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని తెలిపారు. అధికారిక మాధ్యమాల ద్వారా బుక్ చేసుకుని సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలో 26 గ్యాస్ పంపిణీ కేంద్రాలు పనిచేస్తూన్నాయన్నారు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు.
MLG: HYDలోని రవీంద్రభారతిలో మాజీ MLA మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓంకార్ చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి, ప్రజా ఉద్యమాల్లో ఆరితేరినవారని కొనియాడారు. ఓంకార్ లేని లోటు తెలంగాణకు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
MDCL: వేసవి వేళ ఘాట్‌కేసర్, పోచారం, నారపల్లి, ఉప్పల్లో కొబ్బరి బోండా, పుచ్చకాయల ధరలు పెరుగుతున్నాయి. శివరాత్రి సమయంలో ఒక్కో కొబ్బరి బోండా రూ.20 నుంచి రూ.30 వరకు పలకగా ప్రస్తుతం, రూ.50కి చేరింది. కిలో పుచ్చకాయ రూ.30 నుంచి రూ.45 వరకు చేరింది. ఏప్రిల్ నెలలో వీటి ధరలు ఆకాశాన్ని తాకేలా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి సహా వివిధ ప్రాంతాల్లో ఒకేరోజు ఏకంగా 101 టాయిలెట్ల క్లీనింగ్ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 119 పబ్లిక్ టాయిలెట్లు గుర్తించిన అధికారులు, 9 టాయిలెట్లకు రిపేరింగ్ చర్యలు సైతం పూర్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ADB: పశువుల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామూహిక ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం తలమడుగు పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
HYDలో కాస్త చల్లబడడంతో గత వారంతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పలు చోట్ల చిరుజల్లులు కురిసాయి. దీంతో ఇవాళ షంషీగూడ గరిష్టంగా 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బేగంపేట, మౌలాలి ఏరియాలో ఇదే పరిస్థితి. అంబర్‌పేట బతుకమ్మ కుంట, హయత్ నగర్, హిమాయత్ నగర్ ఏరియాల్లో 36.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
BHNG: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు అప్పుల బాధతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NRML: సారంగాపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ గోదాంను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సరఫరా, భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు పరిశీలించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తదితరులున్నారు.