• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహమ్మదాపూర్ గుట్టల్లో అమర వీరుల వర్ధంతి

SDPT: హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల 78వ వర్ధంతి సభ ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. అమరవీరుల ఘాట్ వద్ద నివాళులర్పించారు. అమరవీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు.

March 14, 2026 / 05:01 PM IST

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: డా. రమేష్ రెడ్డి

SDPT: మార్చి నెలలోనే ఎండలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి ప్రజలకు సూచనలు చేశారు. ఎండలకు ఎక్కువ నీటిని తాగాలని.. దీంతో శరీరంలో నీటి శాతం పెరుగుతుందన్నారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచించారు.

March 14, 2026 / 05:00 PM IST

యుద్ధం ఎఫెక్ట్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లు

WGL: యుద్ధం కారణంగా ఉమ్మడి జిల్లాలో LPG సిలిండర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా WGL జిల్లాలోని 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరి నెలలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్లు ఉండగా.. నిన్న ఒక్క రోజే 59,200 బుకింగ్‌లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యవసర అవసరం ఉన్నవారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

March 14, 2026 / 04:55 PM IST

పెద్ద మునిగల్‌లో వ్యక్తి అదృశ్యం

NLG: దేవరకొండ నియోజకవర్గం నేరేడుగోమ్ము మండలం, పెద్ద మునిగల్ గ్రామానికి చెందిన దాచేపల్లి చెన్నయ్య గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆయన మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఆయనను ఎక్కడైనా చూసినా లేదా ఆచూకీ తెలిసినా దయచేసి వెంటనే 8008823448, 9989437017 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

March 14, 2026 / 04:53 PM IST

మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి: ఎస్పీ

WNP: రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఉపయోగించిన తర్వాత దానిపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని జిల్లా SP సునీత రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో విచారణ సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ పడ్డీ కేసులను వేగవంతంగా విచారించి త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు.

March 14, 2026 / 04:52 PM IST

ముగిసిన న్యాయవాదుల నిరసన

PDPL: గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల తీరుకు నిరసనగా గత నెల రోజులుగా న్యాయవాదులు చేపట్టిన నిరసనలు ముగిశాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణతో పాటు పలు విభిన్న నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు న్యాయవాదులతో జరిపిన చర్చలతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ఇకనుంచి విధులకు హాజరు కానున్నారు.

March 14, 2026 / 04:50 PM IST

‘వరకట్నం తీసుకోవద్దని గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం’

ADB: సాత్నాల మండలం న్యూ టెమ్రిగూడలో కోలం తెగ కుల పెద్దలు శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. కోలం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోనేరావు, జిల్లాధ్యక్షుడు గోవింద్ రావు మాట్లాడుతూ.. తమ తెగలోని ప్రతి ఒక్కరు వరకట్నానికి దూరంగా ఉండి పలు తీర్మానాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మద్యం, మాంసానికి దూరంగా ఉండి సాంప్రదాయ బద్ధంగా వివాహాలు చేసుకోవాలని కోరారు.

March 14, 2026 / 04:47 PM IST

జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు..!

BHPL: జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమస్యలు తలెత్తకుండా వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చూడటానికి జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను డిస్ట్రిబ్యూటర్ల గోదాముల నిల్వలు రోజువారీగా పరిశీలిస్తుందని కలెక్టర్ తెలిపారు.

March 14, 2026 / 04:45 PM IST

శ్రీ సీతారామ కళ్యాణ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రావాలని పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు ఆహ్వానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నందయ్య కోరారు.

March 14, 2026 / 04:45 PM IST

విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం గడుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను శనివారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని వర్కర్లను ఆదేశించారు.

March 14, 2026 / 04:43 PM IST

అదృశ్యం అయిన యువకుడు బావిలో శవంగా తేలాడు

హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలో విషాదం చోటుచేసుకుంది. ఈనెల 4న అదృశ్యమైన గౌతమ్ కుమార్(20) అనే యువకుడు, రాజన్న బావి సమీపంలోని పులమ్మ బావిలో శవమై తేలాడు. ట్యాంక్ బండ్ శివ టీమ్ సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 14, 2026 / 04:42 PM IST

‘పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలి’

MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలన్నారు.

March 14, 2026 / 04:42 PM IST

పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ

KNR: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శనివారం మొదటిరోజు కరీంనగర్‌లో ఓల్డ్ హై స్కూల్, ధన్గర్ వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.

March 14, 2026 / 04:38 PM IST

రింగ్ రైల్ ప్రాజెక్టుకు ఎంపీ హర్షం

HYD: RRR చుట్టూ ప్రతిపాదిత రింగ్ రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు DPR సిద్ధం చేసేందుకు రైల్వే శాఖ అనుమతించినట్లు ఆయన తెలిపారు. ఇది పూర్తయితే నగర శివార్ల రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

March 14, 2026 / 04:36 PM IST

‘రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి’

KMM: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని పెన్షన్ దారుల సంఘం జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం బోనకల్లో నిర్వహించిన పీఆర్పీఏ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి తర్వాత పదవీ విరమణ పొందిన వారికి గ్రాట్యువిటీ, ఇతర ప్రయోజనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 14, 2026 / 04:35 PM IST