PDPL: రామగుండం 2వ డివిజన్ పరిధిలోని శాలపల్లి, జంగాలపల్లి గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఎన్పీడీసీఎల్ ఏఈ వంశీకృష్ణకు కార్పొరేటర్ వెంగళ బాబు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి ఏఈ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. 125 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని ఏఈ వంశీకృష్ణ హామీ ఇచ్చారని కార్పొరేటర్ వెంగళ బాబు వెల్లడించారు.