JN: వచ్చే వర్షాకాలం వరకు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించే బాధ్యత తనదాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జఫర్‌గడ్ మండలంలోని తీగారం, హిమ్మత్ నగర్ గ్రామాల మధ్య కాలువను పరిశీలించారు. కాలువ వెంట క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత బస్తీకి చెందిన యువత పెద్ద ఎత్తున BJPలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు, పాతబస్తీ అభివృద్ధికి నవభారత నిర్మాణానికి బీజేపీతో కలిసి నడుస్తామని యువత పేర్కొన్నారు.
NLG: జిల్లాలోని 106 పరీక్ష కేంద్రాల్లో పదవ తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈవో బిక్షపతి తెలిపారు. మొత్తం 19,672 మంది విద్యార్థులకు గాను 19,635 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసినట్లు తెలిపారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నాలుగు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారని పేర్కొన్నారు.
MDCL: TSRTC కుషాయిగూడ డిపో నుంచి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్సు మార్చి 28 సాయంత్రం 6 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఉజ్జయిని, ఓంకారేశ్వర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, కాశీ క్షేత్రాలను సందర్శిస్తుందన్నారు. టికెట్ ధర రూ. 8,000 ఉందని తెలిపారు. బుకింగ్ కోసం 9959226145, 9603549388 సంప్రదించాలి పేర్కొన్నారు.
HNK: కేయూ మాజీ VC లింగమూర్తి ఇవాళ అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో ఆయన కేయూ అభివృద్ధికి చేసిన సేవను పలువురు గర్తు చేసుకుంటున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో 2009 అప్పటి CM YSR దృష్టికి తీసుకెళ్లి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రస్తుతం 6 బీటెక్ కోర్సుల్లో 360 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర మండుటెండలోనూ ఉత్సాహంగా సాగుతోంది. గంగాధర మండలం సమీపంలో యాత్ర కొనసాగుతుండగా, వైద్య బృందం ఆయనకు రొటీన్ హెల్త్ చెకప్ నిర్వహించింది. ఎండ తీవ్రత దృష్ట్యా మంత్రి ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు, తగు సూచనలు చేశారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించారు.
NZB: ఉపాధ్యా యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TPUS ఉపాధ్యాయ సంఘం నేతలు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి శనివారం వినతి పత్రం అందజేశారు. నూతన PRC అమలు, పెండింగ్‌లో ఉన్న DAల విడుదల, పెన్షన్ సౌకర్యాలు వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని MLA హామీ ఇచ్చారు.
PDPL: పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెడికల్ కోడింగ్&బిల్లింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈ శిక్షణ మార్చి 16 నుంచి పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో ప్రారంభంకానుందని, ఫార్మసీ, బయోటెక్నాలజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
KMM: జిల్లాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును శనివారం ADCP ప్రసాదరావు పరిశీలించారు. నగరంలోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల, మోంట్ ఫోర్ట్ స్కూల్, రాజేంద్రనగర్, నయాబజార్ పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. కమిషనరేట్ పరిధిలోని 98 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా సాగేలా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
BHPL పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా నాయకులు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న TRP జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ శనివారం వారి నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్బంగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ కావేరితో పలు సమస్యలపై చర్చించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ నాయక్, శ్రీరామ్ నాయక్, ఉత్తమ్ రాథోడ్, బానోత్ గజానంద్, దాదేఅలీ, తిరుమల గౌడ్, సయ్యద్ కాసిం, కొర్రల మహేందర్ పాల్గొన్నారు.
ASF: ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ పట్టణంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉందని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.
GDWL: జిల్లా కేంద్రంలో శనివారం వేడుకల కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య రెడ్డిల వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్య మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
WGL: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఖిలా వరంగల్ మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. మామునూరు పోలీస్ స్టేషన్ ఎదుట బొలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో రూ. 25 లక్షల విలువైన గైనకాలజీ ల్యాప్రోస్కోపిక్ పరికరాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు అత్యాధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు స్థానిక మహిళలు శస్త్రచికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన సేవలు ఉన్నాయన్నారు.