KMR: భిక్కనూర్ పట్టణ కేంద్రంలో హోటళ్లు, స్వీట్ హోంలలో అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగం పై సివిల్ సప్లై అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా వాడుతున్న స్వీట్ హోం, టిఫీన్ సెంటర్ల నుంచి 5 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై అధికారి కిష్టయ్య తెలిపారు.
MHBD: మరిపెడ పట్టణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఇవాళ ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 12,10వ వార్డులలో వార్డు సభ్యులు, అధికారులతో కలసి ఆమె పర్యటించి, పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్ని సంబంధిత అధికారులకు సూచించారు.
JN: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ శ్రీధర్ రావు, పాలకమండలి, ఈఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
MDCL: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఈశ్వరరావు, సంతోష్ కుమార్‌తో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.59,310 నగదు, 6 సెట్ల పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NLG: ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ ఆదర్శంగా నిలిచారు. తన వార్డులో ఆడపిల్లల వివాహానికి రూ.15,116 పెళ్లి కానుకగా ఇస్తానన్న మాట ప్రకారం, ఇవాళ బొల్గూరి యాదయ్య కుమార్తె వివాహానికి ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పోకల దేవదాసు, శామ్యూల్, అశోక్, ఏసురత్నం తదితరులు పాల్గొని కౌన్సిలర్‌ను అభినందించారు.
VKB: భగ భగ మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యువకులు స్విమ్మింగ్ పూల్స్ వైపు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రతలు విపరీతంగా పెరుగుతుండడంతో ఎండ దెబ్బలు తట్టుకునేలా పాఠశాల విద్యార్థులు స్విమ్మింగ్ పూల్స్‌లో మునిగి ఈతలు కొడుతున్నారు. వడదెబ్బ బారీన పడకుండా మధ్యాహ్నం వేళ్ళల్లో బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని నూతన బోరుబావికి మోటర్ బిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నీరు వృథా చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ వైస్ ఛైర్మన్ నయీముద్దీన్ పాల్గొన్నారు.
SRPT: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కాకతీయ హైస్కూల్, జడ్పీహెచ్‌ఎస్ కేంద్రాలను ఎస్పీ నరసింహ ఐపీఎస్ పరిశీలించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, మైకులు వాడరాదని ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక ఎస్సైలు ఉన్నారు.
MLG: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామంలోని KGVB పాఠశాలను శనివారం MRO తోట రవీందర్ సందర్శించారు. ఈ సందర్భంగా MRO పలు తరగతి గదులను, వంటగదిని పరిశీలించారు. అనంతరం MRO మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు.
MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో ఇవాళ వరంగల్ మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి ప్రారంభించారు. పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని, రోగనిర్ధరణ పరీక్షలతో వ్యాధిని తెలుసుకుని తగిన చికిత్స చేస్తారని స్పష్టం చేశారు.
NGKL: జిల్లాలోని కేజీబీవీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారిణి శోభారాణి తెలిపారు. బిజినపల్లిలో లాసెట్, వెల్దండలో నీట్, ఎంసెట్, నాగర్ కర్నూల్‌లో ఐఐటీ-జేఈఈ కోర్సులకు నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు. గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
JGL: జగిత్యాల రూరల్ మండలం గోపాల్ రావుపేట గ్రామంలో శ్రీ శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో స్వామి వారికి పూజలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మహోత్సవానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ వసంత హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
BHPL: జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్-2025-26ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం విడుదల చేశారు. జాతీయ బ్యాంకుల అనుసంధానంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ పంప్ సెట్ల పథకాల కోసం జిల్లాలోని అన్ని గ్రామాల SC అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
WGL: నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ హాస్పిటలో శనివారం నుంచి ఆరోగ్యం శ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా హాస్పిటల్ ఛైర్మన్ డా. విద్యాసాగర్ మాట్లాడుతూ.. అన్ని రకాల వైద్య సేవలు 24/7 అందుబాటులో ఉంటాయని మెరుగైన వైద్యం కోసం గ్రీన్ స్టార్ హాస్పిటల్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
SRCL: వల్లంపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించతలపెట్టిన అంగన్ వాడీ కేంద్ర భవనానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో వల్లంపట్ల గ్రామ సర్పంచ్ నేరేళ్ల విజయ్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఉట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య పాల్గొన్నారు.