SRCL: జిల్లాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. అరగంటలో పిచ్చికుక్క కరిచిన ఘటన తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్లో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుసాపూర్లో పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఇద్దరు ఐదు సంవత్సరాలలోపు పిల్లలు, ఇద్దరు యువకులు, ఓ మహిళను కరిచిందని స్థానికులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.