JGL: మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తోపారపు కమల ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ, కరీంనగర్లోని చల్మెడ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆమెను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.