• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘రెండు నదులు జిల్లా పక్కన పారుతున్న ఉపయోగం లేదు’

రెండు నదుల మధ్య ఉన్నా నడిగడ్డ రైతులకు చుక్క నీరు అందకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. గోపాల్ అన్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ జనసభ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.

March 21, 2026 / 04:03 PM IST

త్వరలో 25 RTC బస్ డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లు

HYDలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. 25 ఆర్టీసీ డిపోలలో ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో 2200 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అవసరమైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే అధికారులు పరిశీలించారు.

March 21, 2026 / 04:02 PM IST

బెడిసి కొట్టిన బుజ్జగింపు వ్యూహం.. బేజారైన మంత్రులు

JGL: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిను బుజ్జగించే ప్రయత్నాలు బెడిసిక కొట్టినట్లు తెలుస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం ఆయనతో గంటకు పైగా భేటీ అయ్యారు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం జీవన్ రెడ్డి పేర్కొనడంతో మంత్రులు అవాక్కయ్యారని సమాచారం.

March 21, 2026 / 04:00 PM IST

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థి

MDK: చేగుంటకు చెందిన బ్రిలియంట్ స్కూల్ విద్యార్థిని హన్విత కోరుకొండ సైనిక్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరు కాగా, 223/300 మార్కులు సాధించారు. పాఠశాల కరెస్పాండంట్, ప్రిన్సిపాల్ క్రష్ణకుమార్, డైరెక్టర్లు సీహెచ్ సురేష్ కుమార్, షైక్ ఆరిఫ్, పాఠశాల ఉపాధ్యాయలు విద్యార్థిని అభినందించారు.

March 21, 2026 / 04:00 PM IST

సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ

SDPT: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో నిలిపివేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కోరారు.

March 21, 2026 / 04:00 PM IST

షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు

KMR: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరభావం, సమానత్వం, సమైక్యతా స్ఫూర్తి సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని బోకే, శాలువాతో సన్మానించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

March 21, 2026 / 03:55 PM IST

వేగంగా అభివృద్ధి పనులు: మున్సిపల్ కమిషనర్

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో చాలా కాలంగా డిమాండ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించామని పేర్కొన్నారు. అలాగే ప్రధాన రహదారితో పాటు పలు రోడ్లను విస్తరిస్తున్నామని తెలిపారు. డ్రైనేజీలు రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయన్నారు.

March 21, 2026 / 03:53 PM IST

రాములోరి కళ్యాణ మహోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

NRML: పట్టణంలోని రామ్ మందిర్‌లో గల శ్రీ సీత రామాంజనేయ మందిరంలో ఈ నెల 27న జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవ ఆహ్వాన పోస్టర్లను శనివారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ మహోత్సవానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ ఆవిష్కరణలో కౌన్సిలర్లు, కత్తి నరేందర్‌ పాల్గొన్నారు.

March 21, 2026 / 03:50 PM IST

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

NZB: బోధన్ మండలం కల్దుర్కిలో నాఫెడ్, స్థానిక సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. శనగ దిగుబడిని ఎకరాకు 7.5 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచాలని, కౌలునామా విధానం ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ గంగ శంకర్, ఏఎంసీ ఛైర్మన్ చీల శంకర్ పాల్గొన్నారు.

March 21, 2026 / 03:45 PM IST

పండిట్ దీన్ దయాళ్ అడుగుజాడలు అనుసరణీయం: రవికుమార్

WGL: పండిట్ దీన్ దయాళ్ అడుగుజాడలు అనుసరణీయనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. గిర్మాజీపేటలో ‘దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్’ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. నిరంతర శ్రమ, సైద్ధాంతిక నిబద్ధతతోనే సంస్థాగత నిర్మాణం మరింత పటిష్టమవుతుందని రవికుమార్ అన్నారు.

March 21, 2026 / 03:40 PM IST

మొబైల్ ఫోన్లలో సెక్యూరిటీపై IIIT పరిశోధనలు

HYD: మన మొబైల్ ఫోన్లలో యాప్స్ మన అనుమతి లేకుండా డేటా దొంగిలించకుండా ఉండేందుకు IIIT హైదరాబాద్ పరిశోధనలు చేస్తోదని ఆచార్య అంకిత్ గంగ్వాల్ తెలిపారు. ఫేస్ లాక్ వంటి బయోమెట్రిక్ పద్ధతులు హ్యాక్ అయితే వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడుతుంది. దీనికి పరిష్కారంగా మల్టీ లేయర్ సెక్యూరిటీపై అధ్యయనం జరుగుతోంది.

March 21, 2026 / 03:40 PM IST

దేవరకొండలో కాంగ్రెస్‌లోకి వలసలు

NLG: దేవరకొండ మండలం జిల్లేపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

March 21, 2026 / 03:39 PM IST

అందులో మన జిల్లా లాస్ట్..!

MDCL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025లో భాగంగా 2002 నుంచి ఉన్న ఓటర్ జాబితాను 2025 జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మనూ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, సూపర్వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

March 21, 2026 / 03:35 PM IST

గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులు

KNR: గంజాయి మత్తులో పడి యువత తమ ఉజ్వల భవిష్యత్తును చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మానకొండూరు మండలంలోని జగ్గయ్య పల్లికి చెందిన అనిల్ రెడ్డి, లింగాపూర్‌కు చెందిన భరత్ అనే యువకులు మానకొండూరులోని స్థానిక రైస్ మిల్లుల వద్ద గంజాయి సేవిస్తుండగా, పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీలత తెలిపారు.

March 21, 2026 / 03:32 PM IST

మాంసం దుకాణాల ఆకస్మిక తనిఖీ

NGKL: కల్వకుర్తి పట్టణంలో పలు మాంసం దుకాణాలను కల్వకుర్తి మండల పశు వైద్యాధికారి డాక్టర్ నాగరాజు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాంసాన్ని ఫ్రిడ్జ్‌లలో నిల్వ చేయకూడదని సూచించారు. వ్యాధి సోకిన జీవాల మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 21, 2026 / 03:31 PM IST