• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన తలసాని

HYD: భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మోండా డివిజన్ ఆదయ్య నగర్‌లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానం లాంటిదని అన్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ రక్తాన్ని తలసేమియా బాధితులకు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 23, 2026 / 06:56 PM IST

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం

SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణం సోమవారం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో గ్రామ సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్, పాలకవర్గం సభ్యులు, భక్తులు సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు.

March 23, 2026 / 06:55 PM IST

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యాన్నిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.

March 23, 2026 / 06:52 PM IST

నూతన బార్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

MNCL: లక్షేట్టిపేట బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా గూడూరి గోవిందా రావు, వేల్పుల సత్యం ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి గడికొప్పుల కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం బార్ అసోసియేషన్ నూతన కమిటీ నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా వేల్పుల సత్యం, ఉపాధ్యక్షులుగా పద్మ, కోశాధికారిగా నగురు రవీందర్, సంయుక్త కార్యదర్శిగా మేదరి పాల్సన్ ఉన్నారు.

March 23, 2026 / 06:47 PM IST

వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

SRPT: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం జరిగిన సమీక్షలో మాట్లాడుతూ.. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. 

March 23, 2026 / 06:43 PM IST

చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం: ఎస్పీ

MDK:చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. పలు గ్రామాల నుంచి వచ్చి సమస్యలు, వివాదాలు, పోలీస్ సంబంధిత ఇబ్బందులను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

March 23, 2026 / 06:43 PM IST

సీతారాముల కల్యాణానికి పక్కాగా ఏర్పాట్లు..

KNR: కరీంనగర్ నగరంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని సీతారాముల కల్యాణ మహోత్సవాలకు నగరపాలక సంస్థ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పలు ఆలయాలను సందర్శించిన ఆయన, అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 66 డివిజన్లలోని ఆలయాల వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని, భక్తులకు తాగునీరు, అందించాలని మేయర్ సూచించారు.

March 23, 2026 / 06:42 PM IST

నిరుద్యోగులకు శుభవార్త.. రేపే మెగా జాబ్ మేళా..!

ఖమ్మం SR&BGNR డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జాకీరుల్లా తెలిపారు. పలు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 2019-2025 మధ్య డిగ్రీ పూర్తి చేసిన వారు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 23, 2026 / 06:38 PM IST

వైభవంగా శ్రీ సీతారామ నవరాత్రి వసంతోత్సవాలు

MDCL: పట్టణంలోని హరిదాస మండపంలో శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం సీతారామ మందిరం ప్రాంగణంలో స్వామివారికి మిరియంపల్లి వరుణ్ కుమార్ శర్మ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కందకట్ల సుదర్శన్ రెడ్డి, పరంకుశం మాధవ్, రామచంద్ర రావు, చెందిల్ తదితరులు పాల్గొన్నారు.

March 23, 2026 / 06:36 PM IST

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డీసీసీ

ADB: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం తండా, సోయం గూడ, లెండి గూడ, కమలాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు.

March 23, 2026 / 06:36 PM IST

కనీస వేతనం చెల్లించాలని వినతి

MDK: మున్సిపల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ 2వ పీఆర్సీలో కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఛైర్ పర్సన్ రజిని రాఘవేందర్ గౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు డీఏ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 23, 2026 / 06:34 PM IST

‘భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి’

MLG: ఏటూరునగరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ భగత్ సింగ్ వర్ధంతిని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, వారి త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:34 PM IST

‘ప్రజాసమస్యల పరిష్కారమే మా లక్ష్యం’

VKB: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే తమ లక్ష్యమని వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు. సోమవారం పట్టణంలోని 13వ వార్డు ఆలంపల్లిలో అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. కాలనీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన నిధులు మంజూరు చేయించి, అన్ని వార్డులను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు.

March 23, 2026 / 06:32 PM IST

బడ్జెట్ పై లక్ష్మారెడ్డి తీవ్రమైన విమర్శ

MBNR: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుకు ఎదురుచూసిన రైతులు, మహిళలకు బడ్జెట్‌లో “గుండు సున్నా” మాత్రమే మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. పండుగకాలంలో ప్రజలకు మేలు అందుతుందని ఆశించినవారిని ప్రభుత్వం వంచిందని తీవ్రంగా మండిపడ్డారు.

March 23, 2026 / 06:30 PM IST

పదో తరగతి పరీక్షకు 99.82 శాతం హాజరు

MDK: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 11,236 మందికి గాను 11,216 మంది (99.82%) హాజరైనట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

March 23, 2026 / 06:30 PM IST