ADB: ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫామ్ ధరించాలని ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి తెలియజేశారు. బుధవారం పట్టణంలోని స్థానిక STU భవన్‌లో ఆటో డ్రైవర్, టాక్సీ డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని DSP జీవన్ రెడ్డి తెలిపారు.
KNR: శంకరపట్నం మండలంలోని వంకాయగూడెం అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లేశం, ఉపసర్పంచ్ రేణుక ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం, ప్రభుత్వ పథకాల వినియోగంపై వారికి వివరించారు. అంగన్వాడి టీచర్ పద్మ, తల్లులు, పిల్లలు ఉన్నారు.
HNK: నడికూడ(M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుండి 16 మంది విద్యార్థులు గురుకుల ఎంట్రెన్స్ పరీక్ష రాయగా 15 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులను గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ సన్మానించారు. విద్యార్థులు కష్టపడి చదివి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు.
SRCL: చందుర్తి మండలం జోగాపూర్- రామారావు పల్లి గ్రామాల మధ్య పంచాయతీ పాలకవర్గం రాత్రి స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తున్నారు. అదే సమయంలో అటువైపుగా ఒక వ్యాను రావడంతో స్పీడ్ బ్రేకర్ మీదుగా వెళ్లవద్దని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, వ్యాన్ డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న వారికి మధ్య వివాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
WGL: నగరంలోని CKM ఆసుపత్రిలో సిబ్బంది వసూళ్ల దందా జరుగుతోందని మార్చి 17న HIT TVలో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ డా. సత్య శారద స్పందించారు. ఆసుపత్రిని స్వయంగా సందర్శించి, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చినందుకు HIT TVకు, స్పందించిన కలెక్టర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
MHBD: కొత్తగూడ మండలానికి స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి.రాజేశ్వర్ బుధవారం మండల పరిధిలోని AHS సాదిరెడ్డిపల్లె హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత పరిశీలించారు. ముఖ్యంగా టాయిలెట్ల పనితీరు, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీచేసి, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలన్నారు.
MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన సబ్బని సంతోష్ (40) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. 15 రోజుల క్రితం తల్లి భాగ్యమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఇవాళ భార్య పుష్పలత, సోదరి మంజులను మేనమామ ఇంటికి పంపాడు. ఈ క్రమంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సంతోష్ తల్లి మరణం తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
VKB: ఈనెల 30న తై బజార్, షట్టర్లు, వాటర్ ఫిల్టర్ల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్ డి.వై. నరసింహులు, కార్యదర్శి లాలప్ప బుధవారం తెలిపారు. పంచాయతీ ఆదాయ వనరుల పెంపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
JGL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వగ్రామమైన పెగడపల్లి మండలం బతికపల్లి సర్పంచ్ ముంజ మహేశ్వరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా, 1500 ఆయన అనుచరులు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
MBNR: ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఇసుక విషయంలో క్షేత్రస్థాయిలో తనిఖీలను చేపట్టాలని ఆదేశించారు. ఇసుక విషయంలో అన్ని బుకింగ్‌లు ఆన్లైన్లో జరగాలని అన్నారు.
NRPT: నారాయణపేటలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సైలు కృష్ణ చైతన్య, గాయత్రి అవగాహన కల్పించారు. బుధవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జిల్లా ఆసుపత్రి సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తూ.. డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ASF: జైనూరు మండలం గౌరీ గ్రామంలో జైనూర్- లింగాపూర్ రహదారి మధ్యలో వంతెనను హై లెవెల్ వంతెనగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం లోలెవల్ వంతెనను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. లోలెవెల్ వంతెనతో వర్షాకాలంలో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, హై లెవెల్ వంతెన నిర్మాణంతో ప్రజలకు సౌకర్యం కలుగుతుందన్నారు.
HYD: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్‌లో వైష్ణవి అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అనారోగ్య సమస్యలే దీనికి కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
MNCL: నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఎండిపోకుండా కాపాడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం జన్నారం మండలంలోని జన్నారం, పోన్కల్ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలో ఉన్న నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృశ్య మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని ఆయన ఆదేశించారు.
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 27న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ ఈవో ఎల్. రమాదేవి కొద్దిసేపటికి క్రితం ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు.