KNR: 14 ఏళ్ల బాలికలు HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారించవచ్చని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మన వేణి అంజి యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన HPV వ్యాక్సిన్ అవగాహన పోస్టర్‌ను ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.
SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి సర్పంచ్ నీల ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాతూరి వెంకట స్వామి గౌడ్, కొంగరి రవి, బొమ్మెర సంయుక్త శ్రీధర్ పాల్గొన్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ బీటెక్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 47% మంది మాత్రమే పాస్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. పునర్ మూల్యాంకనం రుసుమును పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విసి శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు.
NGKL: సలేశ్వరం జాతరకు వెళ్లే రహదారి ఎర్రమట్టి దుమ్ముతో నిండిపోయింది. వాహనాల తాకిడికి దుమ్ము భారీగా లేవడంతో తెల్లటి వాహనాలు ఎరుపు రంగులోకి మారుతున్నాయి. బైక్ భక్తులు తల నుంచి కాలి వరకు మట్టితో నిండిపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై నీళ్లు చల్లించి దుమ్ము లేవకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
MDK: తూప్రాన్ పట్టణ పురాతన రామాలయంలో శుక్రవారం చక్రస్నానంతో రామాలయ శ్రీరామనవమి ఉత్సవాలను ముగించారు. గత నెల 25న ఉత్సవాలకు అంకురార్పణ చేపట్టగా, సీతారాముల కళ్యాణం, ప్రతిరోజు స్వామి వారి సేవల ఊరేగింపు చేపట్టారు. ఈరోజు ఉదయం స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. అనంతరం పసుపులేరు వాగులో స్వామివారి విగ్రహాలకు మున్సిపల్ ఛైర్మన్ దంపతులు చక్రస్నానం నిర్వహించారు.
NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఇవాళ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీసీ భవనంలో ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారం శ్రీనివాస్, చేగొండి మురళి యాదవ్ తదితర నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
WGL: గ్రేటర్ వరంగల్‌లోని కొత్తపేట గ్రామానికి చెందిన ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ అంకేశ్వరపు రమాదేవి అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
SRD: రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిజాంపేట మండలం బాచేపల్లి PACS నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,875 చొప్పున రైతుల నుంచి శనగలు కొనుగోలు చేస్తుందన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు, వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చర్చి నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించగా భక్తులను ఆకట్టుకుంది. చర్చి ఫాదర్ రాజా పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు శిలువ నాటకం ప్రదర్శించారు. అనంతరం పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
KMR: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ తెలిపారు. శిబిరంలో పాల్గొనే మొదటి 200 మంది రక్తదాతలకు హెల్మెట్‌లు అందజేస్తారని పేర్కొన్నారు.
RR: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 5 మందికిపైగా గుమిగూడటం నిషేధం, బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. ఈనెల 4వ తేదీ ఉ. 6 గంటల నుంచి సా.6 గంటల వరకు నిషేధాలు అమలు ఉంటాయని, ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ADB: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషాను శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు కలిసి వినతపత్రాన్ని అందజేశారు. అర్హులైన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేవిధంగా చూడాలని పేర్కొన్నారు.
RR: నందిగామ మండల పరిధిలోని చంద్రయన్ గూడ గ్రామంలో మురుగు కాలువ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో దశల వారీగా ప్రతి పనిని చేపట్టి పూర్తి చేస్తామని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
MLG: ఎటురునాగారంలో గుల్షన్-ఎ-ఫాతిమా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి శిబిరం ప్రారంభించారు. ఎక్స్ రోడ్ మస్జిద్-ఎ-ఖాద్రియా వద్ద ఎస్సై మహేష్ శిబిరాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
KNR: హుజూరాబాద్ మండలం చిన్న పాపయ్యపల్లి గ్రామసభలో పాలకవర్గం అఖిలపక్ష జేఏసీ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయం మేరకు సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు ఆమోదంతో సిర్సపల్లి గ్రామ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని మొదటి తీర్మాణం చేశారు. అమోదం పొందిన తీర్మానాన్ని జేఏసీ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లూరి చిరంజీవి, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.