NGKL: కల్వకుర్తి పట్టణంలో పలు మాంసం దుకాణాలను కల్వకుర్తి మండల పశు వైద్యాధికారి డాక్టర్ నాగరాజు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాంసాన్ని ఫ్రిడ్జ్‌లలో నిల్వ చేయకూడదని సూచించారు. వ్యాధి సోకిన జీవాల మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.