• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రూ.541 కోట్ల సైబర్ మోసంలో నిందితుడి అరెస్ట్.?

KMM: సత్తుపల్లి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన రూ. 541 కోట్ల సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎర్రుపాలం మండలంకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన లేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కుంభకోణంలో నిందితుల మూలాలు బయటపెట్టేందుకు విచారణ వేగవంతం చేశారు.

February 28, 2026 / 01:10 PM IST

ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం చూడాల్సిందే .!

SRPT: అనంతగిరి మండలం మొగ్గులాయికోట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి రెండు కిలోమీటర్ల మేర అధ్వానంగా ఉంది. గ్రామస్తులు ఈ రహదారి గుండా వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. సరైనా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు సొంత ద్విచక్ర వాహనాలపైనే ప్రయాణించాల్సిన పరిస్థితి. వెంటనే సంబంధిత అధికారులు రోడ్డు విధించి బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

February 28, 2026 / 01:08 PM IST

‘మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ పై చర్యలు తీసుకోవాలి’

KMM: మంత్రి తుమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ రఘుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఖాదర్ బాబా అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులకు నేతలు ఫిర్యాదు చేశారు. భూదాన్ భూముల విషయంలో జర్నలిస్టు రఘు సీనియర్ మంత్రి తుమ్మలపై అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

February 28, 2026 / 01:07 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన మాజీమంత్రి

వనపర్తి పట్టణం 6వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గోకం పాండు హైదరాబాదులోని రేంజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం ఆయనను పరామర్శించడు. అనంతరం వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడవద్దు అని, అండగా ఉంటానని భరోసానిచ్చారు.

February 28, 2026 / 01:05 PM IST

ధర్పల్లిలో గ్రామసభ అభివృద్ధిపై చర్చ

NZB: ధర్పల్లిలో శనివారం సర్పంచ్ సీహెచ్.శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ప్రతి రెండు నెలలకోసారి జరిగే ఈ సభలో భాగంగా, గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. గత రెండు నెలల్లో నూతన పాలకవర్గం చేపట్టిన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన జమా ఖర్చుల వివరాలను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ప్రజలకు చదివి వినిపించారు

February 28, 2026 / 01:05 PM IST

స్ట్రీట్ లైట్ల సమస్యను పరిష్కరించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

BHNG: ఆలేరు పట్టణ కేంద్రంలోని సిల్క్ నగర్ కాలనీలో వీధిలైట్లు లేకపోవడం వల్ల చీకటిగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక వాసులు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్‌కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి వీధిలైట్లను వేయించడం జరిగింది. పట్టణ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:04 PM IST

‘టైలరింగ్ వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి కృషి’

NLG: టైలరింగ్ వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. టైలర్స్ డే సందర్భంగా నకిరేకల్‌లోని మెయిన్ సెంటర్‌లో టైలర్స్ యూనియన్, మేరు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై జెండాను ఆవిష్కరించారు. టైలరింగ్ వృత్తిదారులకు సమాజంలో ఎంతో గుర్తింపు ఉందన్నారు.

February 28, 2026 / 01:03 PM IST

‘ప్రతిరోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలి’

ASF: కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి శనివారం పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీల శుభ్రత, చెత్త తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వార్డులోనూ ప్రతిరోజూ పరిశుభ్రత పనులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

February 28, 2026 / 01:02 PM IST

సంత్ సేవాలాల్ శోభాయాత్ర ర్యాలీ

RR: గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ఠాప, భోగ్ బండారో ప్రత్యేక పూజ కార్యక్రమం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ర్యాలీకి గిరిజన నాయకులు, మహిళలు, తండావాసులు తరలివచ్చారు.

February 28, 2026 / 01:01 PM IST

గచ్చిబౌలిలో అంతర్జాతీయ హాకీ సమరం

HYD: గచ్చిబౌలి హాకీ స్టేడియం మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్‌లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7.30 గంటలకు CM రేవంత్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించనున్నారు.

February 28, 2026 / 01:01 PM IST

గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి

KMM: వైరా మండలం సోమవారం గ్రామంలోని శ్రీ కానిపాకం విగ్నేశ్వర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లతో సిబ్బంది సరైన విధంగా ప్రవర్తించడం లేదని ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తరువాత వాచర్లు ఇవ్వడం లేదని, అడిగితే లేవని నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.

February 28, 2026 / 12:55 PM IST

దేవరకొండలో ఘనంగా టైలర్స్ డే

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో ఉన్న కొంతమంది టైలర్స్ని శాలువాతో సత్కరించి అభినందించారు. టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టైలర్స్‌ను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు.

February 28, 2026 / 12:54 PM IST

రామయ్య నిత్య కళ్యాణం వైభవంగా

BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి, విశ్వక్సేన పూజ, కంకణధారణ తదితర కార్యక్రమాల మధ్య అర్చకులు నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

February 28, 2026 / 12:53 PM IST

FLASH: GHMC చట్టం స్థానంలో రానున్న కొత్త కోర్ అర్బన్ చట్టం

HYD: ORR పరిధి మూడు కార్పొరేషన్లకు వర్తించేలా GHMC చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, వాటర్ హార్వెస్టింగ్, చెరువుల అభివృద్ధి పనులను 99 రోజుల కార్యాచరణలో ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించారు.

February 28, 2026 / 12:50 PM IST

క్లిక్ చేసే ముందు ఆలోచించండి

RR: షాద్ నగర్ పట్టణంలోని కుంటపడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సింబయాసిస్ ఇంటర్‌నేషనల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నరసింహులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్ చేయడం మూలంగా నష్టపోవడం తప్ప ఏది ఉండదని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్లిక్ చేసే ముందు ఆలోచించాలని తెలిపారు.

February 28, 2026 / 12:49 PM IST