• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఐదుగురు జూదరుల అరెస్టు

NLG: పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులు ఐదుగురు జూదరులను అరెస్టు చేశారు. వన్ టౌన్ సీఐ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడం పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం రాత్రి కొందరు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచరం మేరకు తనిఖీలు చేయగా.. ఇస్మాయిల్, శ్రీధర్, నాగేందర్, నాగేందర్, అంజయ్యను పట్టుకున్నట్లు తెలిపారు.

March 7, 2026 / 08:03 AM IST

‘పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం’

PDPL: పర్యావరణ పరిరక్షణకు అందరం కలిసి కృషి చేద్దామని రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్ పిలుపునిచ్చారు. పొల్యూషన్‌ను నివారించి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రామగుండం సింగరేణి ప్రాంతం బొగ్గు గనులు NTPCకు భారతదేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.

March 7, 2026 / 08:02 AM IST

కొనసాగుతున్న మహిళా క్రీడా పోటీలు

BHNG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెండో రోజు శుక్రవారం మహిళా క్రీడా పోటీలు కొనసాగినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా టీజేఏసీ అధ్వర్యంలో స్పీడ్ వాక్, టెన్నికాయిట్ సింగిల్, క్యారమ్స్, స్పీడ్ వాక్ నిర్వహించినట్లు తెలిపారు.

March 7, 2026 / 08:02 AM IST

గంజాయి పట్టివేత…. ఇద్దరిపై కేసు నమోదు

JGL: వెల్గటూర్ మండలం జగదేవపేట శివారులో గంజాయి పట్టుబడింది. ఎస్సై పి.ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్, కళ్యాణ్‌ నిషేధిత గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.

March 7, 2026 / 08:00 AM IST

బాధిత కుటుంబానికి LOC అందజేత

BHPL: అంబట్పల్లి గ్రామానికి చెందిన పుట్ట మధునక్క అనే మహిళ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక నేతలు, IT మంత్రి శ్రీధర్ బాబుకు తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి CMRF నుంచి రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించారు. ఇవాళ మంత్రి PRO బాధిత కుటుంబానికి LOCని అందజేశారు.

March 7, 2026 / 08:00 AM IST

సివిల్స్‌లో సత్తా చాటిన ఎంపీడీవో

WNP: ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో విజయసింహారెడ్డి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 682వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. 2025లో ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా సమర్థవంతంగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉంటూనే సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

March 7, 2026 / 07:56 AM IST

నేటి నుంచి అంజన్న జాతర

VKB: కోడంగల్‌లోని సంగాయిపల్లిలో వెలసిన స్వయంభూ శ్రీ అభయాంజనేయ స్వామి జాతర ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం, సింధూర లేపనం, పల్లకీ సేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం పెరుగు వసంతం, దీపోత్సవం, భజన ఉంటాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

March 7, 2026 / 07:50 AM IST

అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల సమీక్ష

JGL: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాగేశ్వర్ రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు సమీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

March 7, 2026 / 07:44 AM IST

లారీ ఢీకొని కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు

MHBD: తొర్రూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామచందర్, మరొక హెడ్ కానిస్టేబుల్ బజ్జలాల్ గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పట్టణ శివారులో లారీ ఢీకొనడంతో కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లారీని స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.

March 7, 2026 / 07:42 AM IST

మిషన్ మోడ్‌లో ‘ప్రజా పాలన’ : కలెక్టర్ చిత్రా మిశ్రా

KNR: కరీంనగర్ జిల్లాలో మిషన్ మోడ్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో 99 రోజులపాటు చేపట్టనున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది.

March 7, 2026 / 07:34 AM IST

ఈ నెల 15లోపు పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ చేయాలి: కలెక్టర్

KMM: రఘునాథపాలెంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పల్లె దవాఖానలోని వైద్య సేవలను ఆయన పరిశీలించారు. మార్చి 15లోపు పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.

March 7, 2026 / 07:30 AM IST

ఇంటి నిర్మాణానికి భూమి పూజ

NLG: నిరుపేదల సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని 42వ డివిజన్ కార్పొరేటర్ నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం గొల్లగూడకు చెందిన కేదారమ్మ ఇంటి నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో డివిజన్లోని అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

March 7, 2026 / 07:28 AM IST

శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి: డీఎస్పీ

NGKL: రాబోయే పండుగలను ప్రజలందరూ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో జరుపుకోవాలని శుక్రవారం కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

March 7, 2026 / 07:23 AM IST

షార్ట్ సర్క్యూట్‌.. దగ్ధమైన పాలకేంద్రం

MDK: రామాయంపేటలో గాంధీ రోడ్డు దగ్గర ఉన్న పాలకేంద్రంలో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపు చేశారు. పాలకేంద్రంలో ఫర్నిచర్, రెండు ఫ్రిజ్‌లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.1,50,000 నష్టం జరిగినట్లు తెలిపారు.

March 7, 2026 / 07:21 AM IST

‘ఆటంకాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెడతాం’

PDPL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రోజువారిగా షెడ్యూల్ రూపొందించుకుని కార్యక్రమాల ప్రకారం అమలు చేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చేపట్టడంలో ఎక్కడ ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం శానిటేషన్ పరిసరాల పరిశుభ్రత పైళ్ల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామన్నారు.

March 7, 2026 / 07:20 AM IST