MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో శనివారం రెండు దూడలపై చిరుత పులి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్, బావని ఐలయ్య పొలాల వద్ద ఉన్న రెండు దూడలపై దాడి చేసి చంపినట్లు వివరించారు. అటవీ శాఖ సహాయ రేంజ్ అధికారి చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
KNR: హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ భూస్థాపితమవడం ఖాయమని కాంగ్రెస్ నేత ప్రణవ్ స్పష్టంచేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం దేవతల సాక్షిగా చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీని దూషించడం ఆయన మతిభ్రమణానికి నిదర్శనమని, ఆయన మీద ఉన్న కేసులపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
SRPT: హుజూర్ నగర్‌లో విలియమ్స్ హోవే జయంతి సందర్భంగా టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు షేక్ బాజీ ఉల్లా టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆధునిక యంత్రాలు, శిక్షణ, రుణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ జెండా ఆవిష్కరించారు.
NRML: పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి, నేడు పదవి విరమణ పొందుతున్న రాథోడ్ భీమ్ రావ్(ASI),ఎండి అబ్దుల్ రౌఫ్(ASI), ముంతాజ్ ఖాన్(ARHC), ఎం.డి.ఇంతియాజ్( Sr.Asst)లనుజిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘనంగా సన్మానించారు. వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడుతూ.. విధి నిర్వహణలో వారు చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో BJP పార్టీలో చేరిక, అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గ్రామాలు అభివృద్ధి బీజేపీ పార్టీతో సాధ్యమని అన్నారు.
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సర్దని రాజేశం-పద్మ దంపతుల కుమారుడు వేణు జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికయ్యాడు. ఇటీవల వేములవాడలో 4 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలకు పాల్గొని మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ యువకుడు కరీంనగర్‌లో డిగ్రీ చదువుతున్నాడు.
మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.
SRCL: విద్యా కమిషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి. డీటీయూ జిల్లా కన్వీనర్ సంపతి రమేష్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలో ధర్మ టీచర్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన విద్యా విధాన పత్రం 2026 పై రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య కోరుతున్నారన్నారు.
ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో న్యాయ విజ్ఞాన సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సివిల్ జడ్జి యువరాజ్ విద్యార్థులకు చట్టాల ముఖ్యాంశాలు, రాజ్యాంగ హక్కులు, చట్ట అమలుపై వివరించారు. ఈ అవగాహన ద్వారా విద్యార్థులు చట్ట పరిజ్ఞానాన్ని పెంపొందించి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం లక్ష్యమన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర అభివృద్ధి కోసం మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ ఎల్లప్పుడూ కృషి చేయాలని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ నుంచి మేయర్‌గా మారడం ఎంతో సంతోషదాయకంగా ఉందని, పాలమూరు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోయేలా అందరి సహకారం అందాలని పేర్కొన్నారు.
HYD: కొకాపేట్, నియోపోలిస్ ప్రాంతంలో 3.95 ఎకరాల భూమిని ప్రభుత్వం జలమండలికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ స్థలంలో భారీ రిజర్వాయర్ నిర్మించి, కోకాపేట, నియో పోలీస్, ఓల్డ్ సిటీ, షేక్ పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా మంచినీరు సరఫరా చేస్తారు. అంతేకాక.. బోజగుట్ట రిజర్వాయర్‌కు నీరు సరఫరా చేయనున్నారు.
KNR: కథలాపూర్ మండలం సిరికొండ యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రోజున భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ 63వ వర్ధంతిని నిర్వహించారు. బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రచనలో బాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, గాంధారి శ్రీనివాస్, నాంపల్లి శ్రీధర్, మహేష్, మధుసూదన్, సతీష్ పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని పలువురు సర్పంచులు శనివారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతమైన నార్నూరులోని పలు గ్రామాల్లో ఉన్న రహదారులు అధ్వానంగా మారాయన్నారు. దీంతో నూతన సీసీ రోడ్డు, కమిటీ హాల్, నీటి బోర్ వేల్స్ మంజూరు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం పరమేశ్వర్, మహాదు, రాహుల్ పాల్గొన్నారు.
BHNG: భువనగిరి మండలం తాజ్‌పూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వైభవంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సైన్స్ ఫేర్‌లో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
RR: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ను అమృత్ స్టేషన్ పథకం కింద రూ.29.21 కోట్ల వ్యయంతో ఆధునికంగా తీర్చిదిద్దారు. 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. నూతన ముఖచిత్రం, విస్తృత వేచి ఉండే హాల్స్, మెరుగైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ డివిజన్ DRM గోపాలకృష్ణన్ వెల్లడించారు.