• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిట్ వసంతోత్సవంలో అమ్మాయిలదే సందడి

WGL: నిట్‌లో రెండు రోజులపాటు కొనసాగే స్ప్రింగ్ స్త్రీ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఆడిటోరియం, వివిధ విభాగాల్లో ఈవెంట్లు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. బృందాలుగా వచ్చి ఎంతో సంతోషంగా పోటీలో తలపడుతున్నారు. ఈసారి స్ప్రింగ్ స్త్రీ వేడుకల్లో అమ్మాయిల హవా కొనసాగుతోంది.

February 28, 2026 / 06:04 AM IST

పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నిజామాబాద్ జిల్లాలోనీ నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

February 28, 2026 / 06:04 AM IST

బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి

NGKL: జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విశారదన్ మహారాజ్ కార్యాలయంలో బాధితులను పరామర్శించి, రెండు నెలల పాప మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు.

February 28, 2026 / 06:03 AM IST

నేడు కాళోజీ కళాక్షేత్రంలో అంతరిక్ష ప్రయోగాలపై సెమినార్

HNK: అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం (నేడు) మ.2:30 నుంచి 4 వరకు HNK కాళోజీ కళాక్షేత్రంలో సెమినార్ నిర్వహించనున్నారు. అంతరిక్ష ప్రయోగాలపై ప్రముఖ వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

February 28, 2026 / 06:02 AM IST

‘ఫైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’

JGL: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రాయికల్ ఎస్సై సుదీర్ రావు అన్నారు. రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందం ప్రదర్శనలు ఇచ్చారు.సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు, సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రత నియమావళిలో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమం, ఆధునిక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

February 28, 2026 / 05:49 AM IST

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

JGL: భీమారం మండలం కమ్మరిపేట గ్రామానికి చెందిన కోటగిరి రాజేందర్ అనే వ్యక్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 15 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

February 28, 2026 / 05:46 AM IST

గణితాన్ని సులువైన పద్ధతిలో బోధించాలి: రాజర్షి షా

ADB: గణితాన్ని సులువైన పద్ధతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తి చూపుతారని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పేరుతో వినూత్న పైలెట్ ప్రాజెక్టును ఆయన నిన్న ప్రారంభించారు. విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

February 28, 2026 / 05:41 AM IST

కాళేశ్వరంపై విచారణకు లేఖ రాయాలని డిమాండ్

KNR: కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పైకి వేరుగా కనిపించినా లోపల ఒకటేనని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విచారణ ప్రారంభించలేదన్నారు. రాష్ట్రం విచారణకు సిద్ధమైతే కేంద్రం ముందుకు వస్తుందని, సీఎం అధికారికంగా లేఖ రాయాలని కోరారు.

February 28, 2026 / 05:29 AM IST

మరణంలోనూ ఇద్దరికీ పునర్జన్మ

JGL: రాయికల్ పట్టణం శివాజీ నగర్‌కు చెందిన చొప్పదండి నర్సయ్యను ఈనెల 23న గుర్తు తెలియని వాహనం ఢీకొనగా, చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ‘బ్రెయిన్ డెడ్’కు గురయ్యారు. మృతుడి భార్య ఆండాలు, కుమారుడు సురేశ్ అంగీకారంతో నర్సయ్య కు చెందిన లివర్, ఊపిరితిత్తులను దానం చేసి, మరణంలోనూ నర్సయ్య మరో ఇద్దరి ప్రాణాలకు జీవం పోశారు.

February 28, 2026 / 05:15 AM IST

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌గా శ్రీనివాస్

KNR: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌గా కొలిపాక శ్రీనివాస్ ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి ప్రకటించారు. ఈ నియామకం తక్షణ ప్రభావంతో అమల్లోకి వచ్చిందని, పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. మండల, పట్టణ, గ్రామ స్థాయి కమిటీలను సమన్వయం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు.

February 28, 2026 / 05:11 AM IST

బి-జోన్ క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితం

PDPL: మంథని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో బీ-జోన్ క్రికెట్ పోటీలు రెండో రోజు రసవత్తరంగా సాగాయి. కొత్తగూడెం అకిట్స్ ఇంజనీరింగ్ కళాశాల రెండు విజయాలతో సెమీఫైనల్కు అర్హత సాధించింది. బిట్స్పై లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన అకిట్స్ జట్టు, ట్రినిటీపై కూడా ఆధిపత్యం చాటింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సింగరేణి ఆర్జీ3 ఏరియా పర్యావరణాధికారి రాజిరెడ్డి ప్రదానం చేశారు.

February 28, 2026 / 04:58 AM IST

అన్నదాతలకు యాప్ కష్టాలు

SRCL: గంభీరావుపేట మండలంలోని రైతులను యూరియా ‘యాప్’ కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక ఇబ్బందులతో యూరియా దొరక్క అన్నదాతలు అల్లాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం ఒక సమస్య అయితే, పట్టాదారు పాస్బుక్కులకు ఫోన్ నంబర్లు అనుసంధానం కాకపోవడం మరో అడ్డంకిగా మారింది. యాప్ ద్వారా ఎరువులు ఎలా పొందాలో తెలవక ఇబ్బందులు పడుతున్నారు.

February 28, 2026 / 04:41 AM IST

ఓల్డ్ హై స్కూల్ విద్యార్థి అక్షయ్ ప్రతిభ

KNR: కౌమార విద్య, HIV, AIDS పైన విద్యార్థులలో అవగాహన కల్పించుటకు జిల్లా స్థాయిలో నిర్వహించిన పోస్టర్ మేకింగ్ పోటీలలో కరీంనగర్ ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల 9th విద్యార్థి కుంచం అక్షయ్ కుమార్ ద్వితీయ బహుమతి సాధించారు. జిల్లా అదనపు పరిపాలనాధికారి అశ్వినీ తానాజీ వాకడే, క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చేతుల మీదుగ అందుకున్నారు.

February 28, 2026 / 04:26 AM IST

ప్రేమ పేరుతో మోసం

SRCL: సోషల్ మీడియా పరిచయం పెళ్లి మోసానికి దారి తీసిన ఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం పట్టణ సీఐ బి. వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం ఇద్దరూ వేములవాడకు వచ్చి ఓ లాడ్జ్‌లో గది తీసుకున్నారు.

February 28, 2026 / 04:15 AM IST

బీజేపీలో చేరిన సీనియర్ వైద్యులు

JGL: కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు, డాక్టర్ వై. అనూప్ రావు భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, JGL అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబుల సమక్షంలో శుక్రవారం చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు.

February 28, 2026 / 04:12 AM IST