• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు తొర్రూరుకు ఎంపీ కడియం కావ్య రాక

MHBD: తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:00 గంటలకు నూతన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు హాజరుకానున్నారు.

February 26, 2026 / 06:32 AM IST

కళాశాల భవనం కోసం ప్రకటన

కరీంనగర్ మైనారిటీ సంక్షేమ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు-2)కు తగిన భవనం అవసరమని జిల్లా మైనారిటీ అధికారి వీ. జగదీశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. KNR బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో, సుమారు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో G+3 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తుల భవనం కలిగిన వారు ఈ కింది నంబర్‌కు, జిల్లా మైనారిటీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 06:30 AM IST

సదాశివపేట అభివృద్ధికి సహకరిస్తా: మంత్రి వివేక్

SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. బుధవారం టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక మంత్రిని కలిసి విన్నవించారు. పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

February 26, 2026 / 06:27 AM IST

చిన్నారి మృతిపై విచారణ ప్రారంభం

NGKL: జిల్లా ఆసుపత్రిలో ఇటీవల కుమ్మెర గ్రామానికి చెందిన చిన్నారి మరణించిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ కె.రవికుమార్ విచారణ చేపట్టారు. మృతికి దారితీసిన పూర్వాపరాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ విచారణలో తాడూరు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అభిరామ్, గైనకాలజిస్టులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

February 26, 2026 / 06:25 AM IST

నెలవారి నేరసమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ

BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. నిత్యం పోలీసు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

February 26, 2026 / 06:24 AM IST

నేడు బీజేపీ అధ్యక్షుడు రాక

RR: మూసీ ప్రాజెక్టులో గృహాలు కోల్పోతున్న బాధితులకు బాసటగా నిలిచే క్రమంలో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రానున్నారని బీజేపీ నార్సింగి సర్కిల్ అధ్యక్షుడు నగేష్ యాదవ్ తెలిపారు. పరామర్శ యాత్ర బాపూఘాట్‌లో మొదలవుతుందన్నారు. టిప్పుఖాన్ బ్రిడ్జ్, గంధంగూడ మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు గండిపేటకు ఆయన చేరుకుంటారని వివరించారు.

February 26, 2026 / 06:20 AM IST

కుమ్మర ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

MBNR: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామం మల్లన్న ఆలయంలో రెండు నెలల పసి పాపను, ఆ గ్రామ సర్పంచ్ కాలితో తన్నడంతో పాప మరణించింది. ఆ పాప ఆత్మకు శాంతి చేకూరాలని జడ్చర్ల మండలం ఉదండపూర్ గ్రామంలో స్వామి వివేకానంద యువ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.

February 26, 2026 / 06:20 AM IST

హుబ్లీ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌కు గ్రీన్ సిగ్నల్

VKB: బషీరాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రతిష్టాత్మకమైన హుబ్లీ ఎక్స్‌ప్రెస్ ఇకపై బషీరాబాద్ స్టేషన్‌లో నిలపడానికి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసింది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. దీంతో బషీరాబాద్ పరిసర గ్రామాల ప్రజలు, వ్యాపారులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది.

February 26, 2026 / 06:18 AM IST

సైబర్ నేరాలపై పోలీసుల భారీ ఆపరేషన్

HYD: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరిట భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. సైబర్ నేరాలకు వేదికగా మారుతున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పోలీస్ యూనిట్లు, కమిషనరేట్లతో సమన్వయం చేసుకుంటూ నేరాలతో సంబంధం ఉన్న వేలాది అనుమానాస్పద ఖాతాలను గుర్తించారు.

February 26, 2026 / 06:17 AM IST

టెన్త్ ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

MDK: పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

February 26, 2026 / 06:17 AM IST

రాష్ట్రస్థాయిలో గెలిచిన జిల్లా క్రీడాకారులు

JGL: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 2వ ఎడిషన్ సీఎం కప్-2025లో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించారు. పాల్గొన్న వారు కబడ్డీ, ఖో-ఖో, యోగ, బాస్కెట్బాల్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో రాణించారు. బాస్కెట్బాల్, ఖో-ఖోలో కాంస్యాలు, బాక్సింగ్, యోగ, జావెలిన్ త్రో, కిక్ బాక్సింగ్లో రజత పతకాలు దక్కాయి. వారిని కలెక్టర్ అభినందించారు.

February 26, 2026 / 06:16 AM IST

రజకులపై దాడిని ఖండించిన బీసీ సంఘం

SRCL: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని, ఆ ఘటనలో రెండేళ్ల చిన్నారి మృతి చెందడాన్ని బీసీ సాధికారిత సంఘం తీవ్రంగా ఖండించింది. బుధవారం వేములవాడలోని సంఘం కార్యాలయంలో మృతి చెందిన చిన్నారికి సంతాపం ప్రకటించారు. ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

February 26, 2026 / 06:12 AM IST

మహిళ సిబ్బంది సమాజ రక్షణలో కీలకపాత్ర పోషించాలి: SP

ADB: మహిళా సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని పెంచేలా చేసి, అన్ని రకాల పరిస్థితులలో, విధులలో సంసిద్ధంగా ఉండేలా కఠినమైన శిక్షణ అందించనున్నట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మార్షల్ ఆర్ట్స్, కరాటే శిక్షణను 3 రోజుల పాటు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళా సిబ్బంది స్వీయ రక్షణతో పాటు సమాజ రక్షణలో కీలకపాత్ర పోషించాలని కోరారు.

February 26, 2026 / 06:11 AM IST

టాస్క్ సెంటర్లో ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్

SDPT: సిద్దిపేట ఐటీ టవర్లోని టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ‘ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్’ అవకాశం కల్పిస్తున్నట్లు మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. ఇన్ఫోసిస్, డీట్, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది. 2023-2026 మధ్య బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. గురువారం సాయంత్రం లోగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కేవలం మొదటి 200 మందికి అవకాశమున్నట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 06:11 AM IST

‘వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభం’

ASF: TGNPDCL సంస్థ వినియోగదారుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభించిందని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడే తెలిపారు. 7901628348 కు వాట్సప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. ట్రాక్, ఏజెంట్‌తో చాట్ చేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ ఫిర్యాదుతో ID వస్తుందని తెలిపారు. పరిష్కారం తర్వాత SMS/IVRS ద్వారా సమాచారం అందుతుదన్నారు.

February 26, 2026 / 06:10 AM IST