NLG: గుడిపల్లి మండలం ఘనిపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేతృత్వంలో ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని మండల పార్టీ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం తహసీల్దార్ మధుసుహాసిని, ఎంపీడీవో అండాలు, ఆర్ఐ సత్య రాజ్, సర్పంచ్ మల్లిక వెంకటేశ్వర్లు బాధితుడు భిక్షం కుటుంబాన్ని పరామర్శించారు.
RR: శంకర్ పల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ చాకలి అశోక్ ఇవాళ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బొకే అందజేశారు. ఈ సందర్భంగా రెండో సారి స్వతంత్ర అభ్యర్థిగా, కౌన్సిలర్‌గా గెలిచిన అశోక్‌ను ఎమ్మెల్యే అభినందించారు. వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ తదితరులు గురువారం పరిశీలించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ వల్ల లైబ్రరీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు.
BDK: పాల్వంచ మండలం, గుడిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక దేశానికి సుప్రీమ్ న్యాయమూర్తి ఎస్ తురాయి రాజా పాల్గొన్నారు. వారికి సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ ఆహ్వానం పలికారు.
MBNR: భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం ఒక ప్యాకెట్ ధర 151 రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ గురువారం అన్నారు. జిల్లా కార్యాలయంలో అందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవాలని సూచించారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు చేరవేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9154298637 సంప్రదించాలన్నారు.
SRD: స్వయం పాలన దినోత్సవం సందర్భంగా ZPHS ఏదుల నాగులపల్లిలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి బోధనను ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమం హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
WNP: హాస్టల్ నిర్మాణ పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మార్చి 10వ తేదీ కల్లా భవనాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణపురం మండలానికి చెందిన తంగళ్ళపల్లి చక్రధర చారి–చంద్రికలు 371 గ్రాముల వెండి శివలింగాన్ని గురువారం బహుకరించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ క్లర్క్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
BHNG: మార్చి 3న మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి దేవాలయ కమిటీ ఛైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదో బెటాలియన్‌లో రెండో విడత సర్పంచుల శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఇటిక్యాల, ఎర్రవల్లి, మానవపాడు, అలంపూర్, రాజోలి మండలాల సర్పంచ్‌లు హాజరు అయ్యారు. గ్రామ అభివృద్ధి, సభల నిర్వహణ, డ్రైనేజీ, ఖర్చుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
MDCL: మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలోని యూ-టర్న్ వద్ద వాహనం బ్రేక్ డౌన్ అవ్వడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. చెక్‌పోస్ట్ వైపు వచ్చే వాహనదారులు వేగం తగ్గించి, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్‌కు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
SDPT: అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JN: బదిలీపై జోగులాంబ గద్వాల్ జిల్లాకి వెళ్తున్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం సన్మానించారు. జిల్లా పేరును జాతీయ స్థాయికి కలెక్టర్ తీసుకెళ్లారు అని కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో తనదైన మార్క్ సాధించారు అని, విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించారన్నారు.
HYD: రహమత్ నగర్ డివిజన్‌లో అభివృద్ధికి నిధులు కేటాయించాలని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను యూసుఫ్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. డివిజన్‌లో సీసీ రోడ్ల పనులు, రహమత్ నగర్ జంక్షన్ విస్తరణ పనులు తదితర అంశాలపై ఆయన ఎమ్మెల్యేకు వినతి పత్రం అందచేశారు. సానుకూలంగా స్పందించిన వారు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
JGL: రాయికల్ మండలంలోని రామాజీ పేట్ గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన సుమారు 650 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. అధికారులతో కలిసి నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు.