• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఉప్పల గోపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం’

GDWL: మాజీ ఎమ్మెల్యే ఉప్పల గోపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు పేర్కొన్నారు. ఆయన 33వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని రాయల్ లాడ్జి దగ్గర ఉన్న విగ్రహానికి కుటుంబ సభ్యులు సిద్ధార్థ రెడ్డి, రఘునాథ్ రెడ్డితో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 08:38 PM IST

బోర్డు ఉంది.. అక్షరాలు లేవు

PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డుపై అక్షరాలు కనిపించకపోవడంతో దారి తెలియక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం పలు వాహనాల్లో వస్తున్న భక్తులు సూచిక బోర్డు కనిపించకపోవడంతో ఎక్కువ దూరం ముందుకెళ్లి తిరిగి వెనక్కి వస్తున్నారు.

March 3, 2026 / 08:35 PM IST

మంత్రి పొంగులేటిని కలిసిన భద్రాద్రి కలెక్టర్

BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గడిచిన రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి సూచించారు.

March 3, 2026 / 08:25 PM IST

చింతకాయల దొంగతనం,స్టేషన్లో ఫిర్యాదు

KMM: వైరా మండలం విప్పలమడక రైతు వేదిక ఆవరణలో ప్రభుత్వ చెట్టుకు చెందిన చింతకాయలు దొంగిలించబడిన ఘటన పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. మంగళవారం గ్రామ పంచాయతీ గుమస్తా ఎస్సై పవన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తిని తస్కరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.

March 3, 2026 / 08:23 PM IST

హుజురాబాద్ అభివృద్ధిపై ఛైర్ పర్సన్‌తో SE చర్చలు

KNR: హుజూరాబాద్ అభివృద్ధిపై ఛైర్ పర్సన్ తో ఎస్ఈ సుధీర్గంగా చర్చించారు.హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఎన్నికైన రొంటాల సుహాసినిని మంచిర్యాల జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కండె రవీందర్ కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రజా సమస్యలపై వారు చర్చించారు. ముఖ్యంగా 29, 30 వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు.

March 3, 2026 / 08:21 PM IST

తెరుచుకున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కొద్దిసేపటి క్రితం ఆలయ అర్చకులు తెరిచారు. ఆలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా అర్చకులు ఏకాంత సేవలు మాత్రమే నిర్వహిస్తున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం నుంచి మూసివేసిన ఆలయాన్ని రాత్రి తెరిచారు. గ్రహణం ముగిసి న అనంతరం 7.16 గంటలకు పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 3, 2026 / 08:16 PM IST

ఆర్టీసీ కండక్టర్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం

ADB: ఉట్నూర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వేముల ఉషన్న అనారోగ్యంతో హైదరాబాదులోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయన అంత్యక్రియల కోసం సంస్థ తరఫున దహన సంస్కారాల నిమిత్తం రూ. 30 వేల నగదును డిపో క్యాషియర్ చంద్రశేఖర్ మృతుని స్వగ్రామం ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు అందజేశారు.

March 3, 2026 / 08:14 PM IST

అప్పుల గొడవతో గృహిణి ఆత్మహత్య

NLG: అప్పుల విషయంపై భర్తతో జరిగిన గొడవతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల మండలం సుంకెనపల్లిలో చోటుచేసుకుంది. భర్త శేఖర్ లారీ కోసం చేసిన అప్పులపై ఫిబ్రవరి 25న గొడవపడ్డారు. మనస్తాపం చెందిన బొజ్జ పావని (35) ఒంటిపై టర్పెంట్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మరణించిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 3, 2026 / 08:12 PM IST

ఈనెల 6న గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు

KNR: కరీంనగర్ 2 డిపో నుంచి, ఈనెల 6న గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు, డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో ఉడిపి, ముఖంబికా అమ్మవారి దర్శనం, మృడేశ్వర్, గోకర్ణ టెంపుల్స్ దర్శనం, గోవా బీచ్ లో ముఖ్య ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. మార్చి 6న సా.4 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఈనెల 10న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు.

March 3, 2026 / 08:11 PM IST

హోలీ సంబరాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

NZB: డిచ్‌పల్లి మండలం ముల్లంగిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల కొండ ప్రశాంత్ రెడ్డి (నగేష్ రెడ్డి) ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పంటలు బాగా పండి అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. పరస్పరం రంగులు పూసుకుంటూ పండుగ జరుపుకున్నారు.

March 3, 2026 / 08:10 PM IST

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలు

SRCL: ఇల్లంతకుంట మండల ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ సంబరాలు మిన్నంటాయి. క్లబ్ ప్రతినిధులు, సభ్యులు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హోలీ పండుగ సామాజిక సామరస్యానికి, స్నేహభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. క్లబ్ కార్యవర్గ సభ్యులు, మండల విలేకరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 08:06 PM IST

నందిగామలో చెరువు కట్టను పరిశీలించిన ఏఈ

MDK: నిజాంపేట మండలం నందిగామ గ్రామ చెరువు కట్టను ఇరిగేషన్ ఏఈ శ్రీనిధి ఇవాళ పరిశీలించారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కట్టకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 08:00 PM IST

‘ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి’

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలోని రహదారి అయినా జనగాం హుస్నాబాద్ రోడ్డులో ఉన్న మూలమలుపుల వద్ద ప్రమాద సూచికల బోర్డు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూలమలుపుల వద్ద ఎలాంటి సూచికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి బోర్డ్స్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

March 3, 2026 / 08:00 PM IST

సహజ రంగులతో హోలీ ఆదర్శంగా నిలిచిన యూత్

NLG: చిట్యాల పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న, పెద్ద, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా చిన్న కాపర్తి గ్రామంలో జ్వాలా యూత్ సభ్యులు సహజమైన రంగులతో పండుగను జరుపుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ వేడుకలు యువతలో ఐక్యతను చాటాయి.

March 3, 2026 / 07:55 PM IST

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి రేపే చివరి తేదీ

KNR: కరీంనగర్‌లోని క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సం.కి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదని KNR జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలో 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు tgss.telangana.gov.in చేసుకోవాలి. MAR 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా,ఏప్రిల్ 27నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.

March 3, 2026 / 07:48 PM IST