BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. నిత్యం పోలీసు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.