• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

కృష్ణా: వేసవిలో నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డి.ఆర్.డి.ఓ ఉమాదేవి సూచించారు. గురువారం ఆమె పానగల్ మండలంలోని వివిధ నర్సరీలను పరిశీలించారు. వన సేవకులు గ్రామపంచాయతీ కార్యదర్శులు, అధికారుల సమన్వయంతో మొక్కలు పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. నీరందక మొక్కలు ఎండి పోతే చర్యలు తప్పవు అన్నారు.

March 5, 2026 / 09:38 AM IST

పలు ప్రాంతాల్లో నేడు కరెంటు కట్

PDPL: రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేదరి బస్తిలో రోడ్ల వెడల్పు కార్యక్రమం కొనసాగుతోంది. పాత విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రాం మందిర్ ఏరియా సబ్ స్టేషన్ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

March 5, 2026 / 09:38 AM IST

రైతును ముంచిన టమాట పంట.!

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో రైతు అల్లాడి గణేష్ టమాట పంటను మేకలు, గొర్రెలకు వదిలేశాడు. టమాట ధరలు విపరీతంగా క్షీణించడంతో రవాణా ఖర్చులు రాలేని పరిస్థితి ఏర్పడింది. గణేష్ ఎకరా భూమిలో టమాట పంటను సాగు చేశాడు. ధర లేకపోవడంతో టమాట పంటను వదిలేయగా, మేకలు, గొర్రెలు మేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధరలేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశాడు.

March 5, 2026 / 09:37 AM IST

మహిళా దినోత్సవ వేడుకలకు పోస్టర్ విడుదల

MHBD: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమం సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం క్రీడా పోట్లను నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ తెలిపారు.

March 5, 2026 / 09:36 AM IST

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు

VKB: వ్యవసాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులను అవలంభించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ అన్నారు. బుధవారం డ్రోన్ ఆపరేటింగ్‌పై పైలెట్ ప్రాజెక్టుగా శిక్షణ ఇచ్చారు. సాంకేతిక ఆధారిత జీవనోపాధిని పొందేందుకు అవసరమైన మెలకువలు నేర్చుకోవాలని తెలిపారు. డ్రోన్ల నిర్వహణపై ఆరుగురికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.

March 5, 2026 / 09:32 AM IST

వైకుంఠ రథం లేక ట్రాక్టర్‌లో..

SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్నబోనాలలో మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించడం విమర్శలకు దారితీసింది. అదే వార్డుకు చెందిన రేగుల యాదగిరి మృతిచెందగా, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ రథం కోసం పలు సార్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ట్రాక్టర్‌లో మృతదేహాన్ని తరలించినట్లు స్థానిక కౌన్సిలర్ బోల్గాం వైష్ణవి తెలిపారు.

March 5, 2026 / 09:29 AM IST

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

WGL: కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగాల పేరుతో కొందరు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. నిర్మాణ బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు అప్పగించగా, సోషల్ మీడియాలో కాంట్రాక్ట్ ఉద్యోగాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరూ నమ్మవద్దని రైల్వే అధికారులు సూచించారు.

March 5, 2026 / 09:28 AM IST

చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు: సీఐ

BDK: చుంచుపల్లి ప్రశాంతినగర్‌లో చోటుచేసుకున్న భూవివాదంపై విచారణకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పులిచెర్ల ఆదిత్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్‌ సీఐ ప్రతాప్‌ తెలిపారు. విచారణ సమయంలో పోలీసులపై తిరగబడి, అనుచితంగా ప్రవర్తించినందుకు ఈ చర్య తీసుకున్నామన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 5, 2026 / 09:28 AM IST

వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసిన అధిష్టానం

WGL: రాజ్యసభ సీటుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు నేడు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్నత నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

March 5, 2026 / 09:27 AM IST

విజయ్-రష్మిక రిసెప్షన్ లో మాజీమంత్రి ఎర్రబెల్లి

JN: విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉష దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ కుటుంబంతో తమకు ఆత్మీయ సంబంధం కొనసాగుతుందని తెలిపారు.

March 5, 2026 / 09:26 AM IST

రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

HYD: నగరంలో భానుడి భగభగలకు తోడు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది మార్చి 3వ తేదీనే అనూహ్యంగా నమోదై అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. గత ఏడాది 2025 మే 6న నమోదైన 4,352 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ ఈసారి ఏకంగా 4,421 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.

March 5, 2026 / 09:24 AM IST

మన్నెగూడెం లో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

JGL: మేడిపల్లి మండలం మన్నెగూడెంలో కుట్టు శిక్షణ కేంద్రంను సర్పంచ్ దుంపల నివేదిత రెడ్డి బుధవారం ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు కుట్టుపనిలో మెళకువలు నేర్పించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.

March 5, 2026 / 09:23 AM IST

కెసిఆర్ హయాంలో సంక్షేమ పథకాలు అమలు

KMM: ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు రూ. 7,72,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బుధవారం అందజేశారు. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ సామాన్యులకు అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందే ఈ ఆర్థిక సాయం ఒక వరం లాంటిదన్నారు.

March 5, 2026 / 09:23 AM IST

జోరందుకున్న సాగు.. పెరిగిన యాసంగి విస్తీర్ణం

VKB: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలోని 3,34,627 మంది రైతులు ఉత్సాహంగా సాగు చేపట్టగా, వరి సాగు విస్తీర్ణం గతంలో ఉన్న 75,838 ఎకరాల నుంచి ప్రస్తుతం 93,116 ఎకరాలకు చేరింది. ఇతర పంటలతో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,45,241 ఎకరాల్లో సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడంపై వ్యవసాయ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 09:16 AM IST

‘డిమాండ్ ఉన్న పంటలతో రైతులకు మేలు’

MNCL: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జన్నారం మండలంలోని చాలా గ్రామాలలో రైతులు ఇంకా సాంప్రదాయ పంటలనే పండిస్తున్నారని అన్నారు. అయితే ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగం ఆధారంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేస్తే మేలు జరుగుతుందన్నారు.

March 5, 2026 / 09:15 AM IST