NLG: వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5:50 గంటలకు నందీశ్వరుని అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ‘ఓం నమశ్శివాయ’ స్మరణతో అగ్నిగుండం దాటి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
NZB: జిల్లా ఇందల్వాయిలో విషాదం చోటుచేసుకుంది. ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్(15) హాస్టల్లో ఉరేసుకున్నాడు. విద్యార్థి వద్ద ఫోన్ దొరకడంతో సమాచారం అందుకున్న ప్రిన్సిపల్ విద్యార్థితో అపాలజీ లెటర్ రాయించాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి మంగళవారం రాత్రి హాస్టల్ బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
SRPT: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన చాగంటి మహిత చంద్రగ్రహణం సమయంలో సాయంత్రం 5.30 నిమిషాల సమయంలో ఇంటిలోని రోటిలో నీళ్లు పోసి రోకలి బండను అందులో నెలపగా నిలబడెను దాన్ని చూసి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. మామూలు సమయాలలో ఎంత నిలిపిన నిలవని రోకలి బండ గ్రహణం సమయములో నిలబడటం పెద్దలకు ఆశ్చర్యానికి కలిగించింది.
KMR: కొండాపూర్ గ్రామంలో నేడు నిర్వహించనున్న కుస్తీ పోటీల విజేతకు రూ.2,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి జరుపుల జైల్ సింగ్ తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శవాన్ని పోస్టుమార్టం కోసం ఉంచగా, కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, మంగళవారం నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, ఎంఎవో రవి ప్రకాష్, డ్యూటీ డాక్టర్ మునిషాలను సస్పెండ్ చేశారు.
MNCL: అనుమతి లేకుండా పశువులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ ప్రకటనలో తెలిపారు. SI వివరాల ప్రకారం మంచిర్యాల నుంచి కరీంనగర్ అనుమతి పత్రాలు లేకుండా బొలేరో వాహనాల్లో 12 పశువులను తరలిస్తుండగా NTR చౌరస్తాలోకి అదుపులోకి తీసుకున్నాం. తొగరు మురళి, నారా కిరణ్, చెన్నూరు లక్ష్మయ్య పై కేసు నమోదు చేశామన్నారు.
ASF: హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై CM దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.
VKB: గోక ఫసల్వాడ్‌లో హోలీ పండుగను పురస్కరించుకుని కాముని దహనం కార్యక్రమాన్ని గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ, ఉప సర్పంచ్ చంద్రప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సర్పంచ్ మల్లమ్మ గారు మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే ఈ పండుగ, గ్రామంలో సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.
KNR: నేడు జరగనున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర గణితం-ఏ, బాటనీ, పౌరశాస్త్రం పరీక్షలకు బోర్డు అధికారులు ‘సెట్-సి’ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. జమ్మికుంటలోని 3 కేంద్రాల్లో మొత్తం 692 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో 441 మంది జనరల్, 251 మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
SRD: జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈనెల 5వ తేదీన సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు మై భారత్ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తెలిపారు. కబడ్డీ మహిళా విభాగం, వాలీబాల్ పురుషుల విభాగం, రన్నింగ్ మహిళ, పురుషుల విభాగాల్లో క్రీడలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 99853 51111 నంబర్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
HYD: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి మేడ్చల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద శిక్షతో పాటు జరిమానాలు విధించగా, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
MDK: రామాయంపేట వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తూప్రాన్ మండలం నర్సంపల్లి రెడ్యానాయక్ తాండకు చెందిన సాయి (24) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సాయిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి
వరంగల్ నగరంలోని ఎన్ఐటిలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి వ్యక్తిగత కారణాలతో కొంతమంది విద్యార్థుల మధ్యవాగ్వాదం చెలరేగి దాడులకు చేసుకున్నారు.ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు గాయాలు కాగా,వారికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. మంగళవారం కళాశాల అధికారులు సంబంధిత విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
SDPT: జిల్లా గజ్వేల్ ఆసుపత్రిలో 43 ఏళ్ల మహిళకు అరుదైన గర్భాశయ ఫైబ్రాయిడ్ (లియోమయోమస్) శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. గర్భాశయ కండర గోడలలో పెరిగిన 24 వారాల పరిమాణంలో ఉన్న 13/11/10 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్‌ను వైద్యులు తొలగించారు. ఈ శస్త్ర చికిత్సను డాక్టర్ త్రివేణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రేమ్ కిషోర్, అనస్థీషియా డాక్టర్ మైపాల్ తదితరులు పాల్గొన్నారు.