WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అన్నారు.
WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అన్నారు.
BDK: అశ్వరావుపేట మొద్దులగూడెం గ్రామ దేవత శ్రీ ఏకులపోతమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం తెలిపి శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ప్రజానీకం చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
VKB: కొడంగల్ మండలం కస్తూర్ పల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ శ్రీశైలం గౌడ్ తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తమ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MBNR: మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన ఎరుకలి ఎల్లప్ప అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలకు ఇబ్బంది పడుతుండగా సర్పంచ్ మాణిక్యమ్మ, మాజీ సర్పంచ్ వెంకట్ రామిరెడ్డి చొరవ తీసుకున్నారు. దాతల సహకారంతో రూ.17,500 సేకరించి కుటుంబానికి అందజేశారు. అనంతరం కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
HNK: జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. హనుమకొండ దిశ కమిటీ మీటింగ్‌లో ఛైర్మన్ మాట్లాడుతూ… పేదలకు అందాల్సిన రేషన్, పెన్షన్లు, విద్య, వైద్య సౌకర్యాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని, ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేయాలన్నారు.
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రూప్ మీటింగ్‌లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించారు. సమాజ గమనంలో శ్రామిక మహిళల పాత్ర కీలకమైందన్నారు.
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ గ్రామంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత చైతన్య వంతంగా జరిగాయి. ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రూప్ మీటింగ్‌లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించారు. సమాజ గమనంలో శ్రామిక మహిళల పాత్ర కీలకమైనదన్నారు.
BHPL: జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేయాలని MLA గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. శనివారం HNK కలెక్టర్ కార్యాలయంలో MP కావ్య అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో MLA పాల్గొన్నారు. శాయంపేట మండలంలోని ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో టాయిలెట్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
WGL: నర్సంపేట పట్టణ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ ఛైర్మన్ నరేందర్ గుప్తా అన్నారు. నర్సంపేట 3వ వార్డులో వారు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
NRML: దిలావర్‌పూర్ మండలం సమందర్‌పల్లి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అవగాహన సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా నాయకులు కల్లూరు సుధాకర్, సోన్న భూమేష్ మహారాజ్‌లు పాల్గొన్నారు. సామాజిక హక్కులు, ఐక్యత పై అవగాహన కల్పించారు.
SRPT: నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS)లో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పరిపాలనపై అవగాహన కల్పించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది.
VKB: మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని కౌన్సిలర్ అనురాధ అశోక్ అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని 32వ వార్డులో మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ మహిళా కార్మికులను ఆమె ఘనంగా సన్మానించారు. స్త్రీలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని, వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు తీవ్రంగా పెరిగాయి. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు దాహార్తి తీర్చుకోవడానికి మళ్లీ సంప్రదాయ మట్టి కుండలను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, ఫ్రిజ్ వాడకం వల్ల మట్టి కుందాలకు తగ్గిన డిమాండ్, ఇప్పుడు ఆరోగ్య స్పృహతో మళ్లీ పెరుగుతోంది.
MDK: శివ్వంపేట మండలం అల్లీపూర్‌లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పనులకు గ్రామ ప్రజలు ఎక్కువగా హాజరు కావడం లేదని తెలుస్తోంది. అయితే అల్లీపూర్ తండాకు చెందిన కొందరు కూలీలు మాత్రం పనులకు హాజరై పనులు కొనసాగిస్తున్నారు. గ్రామంలోని మరికొంత మంది ప్రజలు పనులకు హాజరై ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.