SRCL: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో మహిళ సంఘ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సర్పంచ్ చిలుక మల్లేశ్వరి, ఎంపీడీవో రాధా పాల్గొన్నారు.
MDK: ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శుభ్రత, పరిశుభ్రత పనులు చేపట్టారు. మెదక్ రూరల్ ఎస్సై లింగం, తోటి సిబ్బంది పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రం చేస్తున్నారు.
GDWL: అలంపూర్‌లో వెలిసిన జోగులాంబ దేవి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణుల రక్షణకు ఇవాళ అటవీశాఖ డ్రోన్లను రంగంలోకి దించింది. వేటగాళ్ల కదలికలు, అడవి ఆక్రమణలు, కార్చిచ్చును పసిగట్టేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇవి 4 కి.మీ. దూరం వరకు నిఘా ఉంచుతాయని రేంజ్ ఆఫీసర్ వీరేశ్ తెలిపారు. అడవి జంతువులకు ఇక మరింత భద్రత లభించనుంది.
SRD: కంగ్టి మండలం ఎన్కెమూరి సర్పంచ్ పండరి రెడ్డి ఎన్నికల్లో గ్రామ ఆడబిడ్డ పెళ్లికి రూ. 11,111 కానుక ఇస్తానని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా గ్రామానికి చెందిన వందన పెళ్లికి ఆ కానుకను శుక్రవారం రాత్రి అందజేసి ప్రజలకిచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. పెళ్లికూతురు తల్లిదండ్రులు సర్పంచ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
SRPT: మోతే మండలంలోని పలు గ్రామాలకు చెందిన పేద ప్రజలు ఉపాధి లేక వలస బాట పడుతున్నారు. గ్రామాల్లో పని అవకాశాలు కరువు అవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని గండ్లపాడు ప్రాంతానికి మిర్చి కోతలకు వెళుతున్నారు. ముఖ్యంగా 60-70 ఏళ్ల వృద్ధులు సైతం కూలి పనుల కోసం తరలిపోతున్నారు. గ్రామాల్లోనే ఉపాధి హామీ పనులు కల్పించి, వలసలను అరికట్టాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
NLG: థాయిలాండ్ దేశానికి చెందిన సుమారు 20 మంది బౌద్ధ భిక్షువుల బృందం శుక్రవారం నాగార్జునసాగర్‌లోని నందికొండ మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. స్థానికులు వారికి బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్లు, పండ్లు, ఆహార పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
SRCL: సిరిసిల్ల జిల్లా కోర్టు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ నీరజ, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, బార్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు స్వాగతం పలికారు. వారికి పుష్ప గుచ్చం అందజేశారు.
ASF: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వాంకిడి MPDO కార్యాలయంలో శనివారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. MPDO పాటిల్ జ్యోత్స్న ఆధ్వర్యంలో కార్యాలయంలో పేరుకుపోయిన పనికిరాని పాత ఫైళ్లు, రికార్డులను గుర్తించి శుభ్రపరచి క్రమబద్ధీకరించారు. ముఖ్యమైన పత్రాలను, కార్యాలయంలో అవసరమైన సామగ్రిని సక్రమంగా ఏర్పాటు చేశారు.
NLG: పీఏ పల్లి మండలంలో విపరీతమైన విద్యుత్ కోతలపై ఆగ్రహించిన చిలకమర్రి, సూరేపల్లి, రోళకల్ గ్రామాల రైతులు అంగడిపేట స్టేజ్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఈ కార్యాలయానికి తాళం వేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు నష్టం జరుగుతోందని, తక్షణమే నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
NLG: పీఏపల్లి మండలంలో విపరీతమైన విద్యుత్ కోతలపై ఆగ్రహించిన చిలకమర్రి, సూరేపల్లి, రోళకల్ గ్రామాల రైతులు అంగడిపేట స్టేజ్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఈ కార్యాలయానికి తాళం వేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు నష్టం జరుగుతోందని, తక్షణమే నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
KMM: ఖమ్మం రూరల్ పరిధిలో నగదు లావాదేవీల కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. కొండాపురానికి చెందిన ఎం.నాగేశ్వరరావు 2017లో జనార్దన్ రావు వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకుని ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. బాధితుడు కోర్టును ఆశ్రయించగా, విచారణలో నేరం రుజువు అయ్యింది. దీంతో ఎం. నాగేశ్వరరావుకు జడ్జి కాసర గడ్డ దీప ఆరునెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చారు.
RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ 9వ వార్డులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టారు. విజయనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం వెనుక పరిసరాలను పారిశుద్ధ్య కార్మికులతో పాటు కౌన్సిలర్ అశోక్ పాల్గొని శుభ్రం చేశారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య విభాగంలో మహిళా కార్మికుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం 66 డివిజన్లలో మొత్తం 4,647 మంది కార్మికులుండగా, వారిలో సగం మహిళా కార్మికులు ఉన్నారు. గతంలో మహిళలే అధికంగా ఈ పనులు చేసేవారు. అయితే, అనారోగ్యం కారణంగా మహిళ కార్మికుల సంఖ్య తగ్గడంతో.. గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుద్ధ్యం అటకెక్కుతోంది.
MNCL: మంచిర్యాలకు చెందిన మామిడి గంగరాజు అనే వ్యక్తి వద్ద తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చే క్రమంలో చెల్లని చెక్కు ఇచ్చిన దుర్ముట్ల అంజయ్య అనే వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మంచిర్యాల రెండో అదనపు న్యాయమూర్తి కె. నిరోష తీర్పునిచ్చారు. తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించాలన్నారు. బాధితుడు న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించగా కోర్టులో నేరం రుజువు అయింది.