ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్గొండకు చెందిన జాకీర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ 14వ వార్డులో బత్తుల ప్రశాంతి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పావని మాట్లాడుతూ.. ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
SDPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్‌కుమార్ ఆద్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమస్యలను పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్ సూచించారు.
JGL: ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాలలో ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి మంచి నీళ్ళు బావి వద్ద ప్రారంభించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
WNP: ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను వనపర్తి ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తనిఖీ చేశారు. పెబ్బేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను సందర్శించి పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు.
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో పరిశుభ్రతను కాపాడుదామని మునిసిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట్ స్వామి గౌడ్, కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు కౌన్సిలర్లు, అధికారులు ర్యాలీ నిర్వహించారు.
JGL: జగిత్యాల పట్టణలో జరిగిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంచినీళ్ల బావి, ఈద్గా ప్రాంతంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపల్ ఛైర్మన్ సమీండ్ల వాణి, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు.
NZB: నందిపేట్ మండలంలోని బాద్గుణలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గ్రామ పంచాయతీ భవనంలో సర్పంచ్ చెలిమేల స్వప్న ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.
MBNR: జిల్లాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. NECC ఒక్క గుడ్డు ధర 4.30 ఉన్నప్పటికీ.. డిమాండ్ లేకపోవడంతో.. గుడ్డు ధర రూ.3.50 మాత్రమే పలుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో కోడిగుడ్ల ఎగుమతి లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అన్నారు. యుద్ధం వల్ల ఎగుమతి లేకపోవడంతో నిల్వలు పెరిగాయన్నారు.
KMM: రఘునాధపాలెం మండలం కోయచలక వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోయచలక స్వాతి మినరల్స్ దగ్గర ట్రాక్టర్, ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ట్రక్కుని వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. గాయాలపాలైన ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
NLG: నల్గొండ బస్టాండ్‌లో వాహనాల పార్కింగ్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. లోపలికి వెళ్లి వచ్చేలోపే ఆవరణలో నిలిపిన వాహనాల టైర్లలో ఆర్టీసీ, పార్కింగ్ సిబ్బంది గాలి తీసేస్తున్నారు. లగేజీ పెట్టుకుని వచ్చేలోపే ఇలా చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల బస్సుల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని తేలిపారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దక్షిణ దిగ్యాత్ర వేడుక నిన్న రాత్రి వైభవంగా జరిగింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో పోలీసు స్టేషన్‌లో సంప్రదాయ పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. దశాబ్దాలుగా ఏడాదికోసారి పోలీస్ స్టేషన్‌ను శ్రీలక్ష్మీనరసింహస్వామి సందర్శించి పోలీసు ఉన్నతాధికారులతో పూజలందుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.
SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని సర్పంచ్ నాగేష్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఇవ్వాళ ఊరిలోని బావులు, బోర్లు, చేతి పంపుల్లో బ్లీచింగ్ పౌడర్ వేయించారు. కలుషిత నీటి వల్ల వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కాచి వడపోసిన నీటిని తాగాలన్నారు.
MBNR: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజులపాటు ప్రజా పాలన పరిరక్షణ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. ఈ రోజు నుంచి 12 జూన్ 26 వరకు అన్ని ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రత, సెక్షన్ల వారిగా పెండింగ్ పైల్స్ రూపొందించి క్లియరెన్స్ చేయాలన్నారు.
SDPT: పారదర్శక పాలనతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా వ్యవసాయం,విద్య,ఆరోగ్యం,ఉపాధి వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వారం ఒక నిర్దిష్ట రంగంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.