• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే దంపతులు

HNK: శాయంపేట మండలం హుస్సేన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ గుండెకారి రజిత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు అరవింద్-తేజశ్రీ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు జ్యోతి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు.

March 7, 2026 / 11:45 AM IST

‘అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి’

BHPL: ప్రజలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బౌతు శోభ రాజేష్ అన్నారు. శనివారం వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం సరిగ్గా అందుతుందా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలచే విద్యాభ్యాసం చేయించారు.

March 7, 2026 / 11:41 AM IST

HIT TVతో ఏవో రజిత.. ఏమన్నారంటే?

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రామంలో ఏరువాక సాగుబడి కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా AO రజిత HIT TVతో మాట్లాడారు. రైతులు ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే భూములను సిద్ధం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు. విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.

March 7, 2026 / 11:40 AM IST

నారాయణపురం మాజీ సర్పంచ్ కన్నుమూత

SRPT: నడిగూడెం మండలం నారాయణపురం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నెం నర్సిరెడ్డి ఇవాళ మృతిచెందారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నారాయణపురం గ్రామాభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పలువురు నేతలు కొనియాడారు.

March 7, 2026 / 11:35 AM IST

CIMAP శాస్త్రవేత్తలతో డిగ్రీ కాలేజీ విద్యార్థులు

MDCL: బోడుప్పల్‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) పరిశోధన కేంద్రాన్ని ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల B.Sc వృక్షశాస్త్ర విద్యార్థులు సందర్శించారు. శాస్త్రవేత్తలు నిమ్మగడ్డి, జేరనీయం, అశ్వగంధ, తులసి వంటి ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు, డిస్టిలేషన్ విధానం వివరించారు. డైరెక్టర్ జి.వి.కిరణ్ బాబు పాల్గొన్నారు.

March 7, 2026 / 11:35 AM IST

రామాయంపేట మున్సిపాలిటీలో ‘ప్రజా పాలన – ప్రజా ప్రణాళిక’

MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99వ ‘ప్రజా పాలన-ప్రజా ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సందడి నెలకొంది. పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో ‘ప్రజల వద్దకే పాలన’ అనే నినాదంతో మున్సిపల్ యంత్రాంగం శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.

March 7, 2026 / 11:35 AM IST

బింగి దొడ్డి తిమ్మప్ప స్వామికి ప్రత్యేక పూజలు

GDWL: అయిజ మండలం బింగి దొడ్డి పెద్ద చెరువు కట్ట కింద ఉన్న తిమ్మప్ప స్వామికి శనివారం విశేష పూజలు జరిగాయి. అర్చకులు కోనేరు జలాలతో స్వయంభూ విగ్రహానికి అభిషేకం చేసి అర్చన, ఆకు పూజ, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రి భజన కార్యక్రమం ఉంటుందని సేవకులు తెలిపారు.

March 7, 2026 / 11:30 AM IST

‘కూలీలకు ఇబ్బంది కలవకుండా ప్రత్యేక దృష్టి’

MNCL: జన్నారం మండలంలో చేపట్టిన ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరగడంతో అధికారుల ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పని చేయాలని కూలీలకు సూచించడం జరిగిందన్నారు. అలాగే ఎండదెబ్బ తగలకుండా కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు.

March 7, 2026 / 11:29 AM IST

పాఠశాలలో ‘ప్రగతి’ పనులు ప్రారంభం

JGL: గొల్లపల్లి మండలంలోని రంగదామునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ‘ప్రజా పాలన-పల్లె ప్రగతి’ పనులను సర్పంచ్ అఖిల ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు నీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.

March 7, 2026 / 11:29 AM IST

విద్యార్థినిలకు పారిశుద్ధ్య డ్రైవ్

NLG: వలిగొండ (బీబీనగర్ క్యాంపస్)లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను ప్రిన్సిపల్ ఎస్. రూప ప్రారంభించారు. విద్యార్థినులకు పారిశుద్ధ్య డ్రైవ్‌పై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 7, 2026 / 11:27 AM IST

‘చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’

MNCL: చట్టాలపై వార్డు సభ్యులు అవగాహన కలిగి ఉండాలని లక్షెట్టిపేట జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ అన్నారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాలలోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, వార్డు సభ్యుల విధులపై అవగాహన కల్పించారు.

March 7, 2026 / 11:27 AM IST

‘జడ్చర్లలో పన్నులు సకాలంలో చెల్లించండి’

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో ఇంటి, నీటి పన్నులు, వృత్తి-వ్యాపార లైసెన్స్ ఫీజులను సకాలంలో చెల్లించాలని కమిషనర్ లక్ష్మారెడ్డి కోరారు. శనివారం సిబ్బందితో కలిసి పలు వార్డుల్లో పర్యటించి పన్నులు వసూలు చేశారు. సిబ్బంది కాలనీలకు వస్తున్నందున వారికి సహకరించి బకాయిలు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

March 7, 2026 / 11:25 AM IST

పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలి: కలెక్టర్

JN: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలోని చెరువు వద్ద రోడ్డుకు ఇరువైపులా జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త తొలగింపు పరిక్రియను పక్కాగా చేపట్టాలని సూచించారు.

March 7, 2026 / 11:23 AM IST

రోడ్డు విస్తరణకు మోక్షమెప్పుడో..?

SDPT: చేర్యాల అంగడి బజారు నుండి పెద్దమ్మ గడ్డ వరకు ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారి గుండా దాదాపు 30 నుండి 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు ఇరుగ్గా ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ చేపట్టి  సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. 

March 7, 2026 / 11:23 AM IST

పుల్లారావు పోరాటాలు మరువలేనివి

KMM: అణగారిన వర్గాల కోసం ఎర్రజెండా నీడలో పుల్లారావు చేసిన పోరాటం మరువలేనిదని సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి కొనియాడారు. కమ్యూనిస్టు సిద్ధాంత అమలు కోసం, కార్మిక పోరాటాల కోసం తుదిశ్వాస వరకు శ్రమించిన ధీరుడు మోరంపూడి పుల్లారావు అన్నారు. సత్తుపల్లిలో రావి వీర వెంకయ్య భవనంలో పుల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు

March 7, 2026 / 11:21 AM IST