• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం

KMM: చంద్రగ్రహణం ముగియడంతో కూసుమంచి మండలం జీళ్ళచెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. పూజారి చిలకమర్రి స్వామినాథాచార్యులు ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 12:52 PM IST

ఉప్పుగూడలో సందడిగా హోలీ పండుగ సంబరాలు

HYD: ఉప్పుగూడలో ఇవాళ హోలీ పండుగ సందర్భంగా ఉప్పుగూడ బస్తీ వాసులు చాలా సందడిగా హోలీని జరుపుకున్నారు. పిల్లలు పిచికారీలతో, ఒకరిపై ఒకరు రంగులను చల్లుకున్నారు. పెద్దలు ఒకరికొకరు మొహంపై వివిధ రంగులను పూసుకున్నారు. యువతీ యువకులు రంగు నీటిని ఒకరిపై ఒకరు కుమ్మరించుకున్నారు. డప్పుల మోతకు, డీజే పాటలకు, ఉత్సాహంతో నృత్యాలు చేశారు.

March 4, 2026 / 12:47 PM IST

కేవలం మాటల్లోనే చేతల్లో లేదు: బీఆర్ఎస్

GDWL: ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అని గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు అందుతోంది కేవలం 12 గంటలే అని కేటిదొడ్డి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గాజుల కృష్ణా పేర్కొన్నారు. బుధవారం కేడిదొడ్డి మండలం వెంకటాపురం సబ్‌స్టేషన్‌ను రికార్డులను పరిశీలించారు. నిరంతర విద్యుత్ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ మాత్రమేనని, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందించారన్నారు.

March 4, 2026 / 12:42 PM IST

ఉపాధి పనుల్లో ‘ఈ-కేవైసీ’ తిప్పలు.. కూలీల ఆందోళన

KNR: గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో ఉపాధి పనుల వద్ద ‘ఈ-కేవైసీ’ నమోదు కాకపోవడంతో బుధవారం కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు వేచి చూశాక ఈ కేవైసీ రావడం లేదని అధికారులు తమను వెనక్కి పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజులుగా ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని పేర్కొన్నారు.

March 4, 2026 / 12:40 PM IST

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: గండ్ర

BHPL: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లికి చెందిన శ్రీకాంత్ పటేల్, నేతలు ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.

March 4, 2026 / 12:32 PM IST

దారుణంగా 10 కిలోమీటర్ల రోడ్డు

ADB: గాదిగూడ మండలంలోని దాబా(బి) నుంచి లొద్దిగూడ వయా పౌనూర్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గుంతలమయంగా ఉన్న మట్టి రోడ్డు కంకరంగా ఏర్పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది. సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రోడ్డుకు సంబంధిత శాఖ అధికారులు స్పందించి నూతన రహదారిని మంజూరు చేసి తక్షణమే నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రజలు కోరారు.

March 4, 2026 / 12:31 PM IST

పందుల సంచారం.. దోమల దుమారం

VKB: బొంరాస్‌పేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జనవాసాల మధ్య పందులు సంచరిస్తూ కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో అవి స్వైరవిహారం చేస్తున్నాయని, దోమల బెడద కూడా రోజురోజుకు ఎక్కువ అవుతోందని వారు అన్నారు. అధికారులు స్పందించి వెంటనే దోమల బెడదకు నివారణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

March 4, 2026 / 12:31 PM IST

ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు

NRML: భద్రాద్రి ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్‌ను బుధవారం ఏర్పాటు చేశారు. రూ.151 చెల్లించి ఈ నెల 31లోపు నమోదు చేసుకుంటే, కల్యాణం అనంతరం తలంబ్రాలు ఇంటికి అందజేస్తామని డిపో మేనేజర్ కే. పండరి తెలిపారు.

March 4, 2026 / 12:29 PM IST

ధాన్యం నిల్వలు, లెక్కల్లో తేడాలు..కేసు నమోదు

ASF: సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో గతంలో ఆడిట్ నిర్వహించగా, ధాన్యం నిల్వలు, లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఇటీవల దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల మిల్లుకు చెందిన ఓ వ్యక్తిని విచారించి, కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

March 4, 2026 / 12:28 PM IST

ఈనెల 6న ప్రభుత్వ ITI ఆవరణలో మినీ జాబ్ మేళా

MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ITI ఆవరణలో ఈనెల 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ బుధవారం ప్రకటనలో తెలిపారు. జీవీ అరణ్య మోటార్స్‌లో 17 ఖాళీలు ఉన్నాయన్నారు. 18 నుంచి 35సం:ల వయసు గల అర్హులైన నిరుద్యోగ యువకులు జాబ్ మేళాలో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 12:27 PM IST

విద్యాశాఖలో బదిలీల మాఫియా నడుస్తోంది: మాజీ ఎమ్మెల్యే

SRPT: కోదాడ డివిజన్లో ఉపాధ్యాయుల రివర్షన్ బదిలీల వ్యవహారం విద్యాశాఖలో అవినీతికి అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. పోస్టింగ్‌లు పైరవీకారులకే అనుకూలంగా జరుగుతున్నాయని, నిబంధనల ప్రకారం పనిచేసే ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బదిలీలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

March 4, 2026 / 12:26 PM IST

బాలికపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడు

KMM: ఏన్కూరు మండలంలో మంగళవారం మానవత్వాన్ని మంటగలిపే ఘటన జరిగింది. 63 ఏళ్ల వ్యక్తి, బాలికకు బిస్కెట్ ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీనిని గమనించిన స్థానికులు స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంధ్య తెలిపారు.

March 4, 2026 / 12:22 PM IST

కరీంనగర్ కార్పొరేటర్‌కు సన్మానం

PDPL: ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన భాస్కర్ నాయక్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ధర్మారం వచ్చిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు భాస్కర్ నాయక్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు కొమురయ్య, రంజిత్, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

March 4, 2026 / 12:21 PM IST

హోలీ వేడుకల్లో మీడియా ప్రతినిధుల సందడి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోలీ వేడుకల సందర్భంగా రోజు వార్తల్లో నిమగ్నమై ప్రజలకు నిత్యం వార్త సమాచారాన్ని అందించే మీడియా ప్రతినిధులు హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ ఎస్సై లక్ష్మారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి హోలీ శుభాకాంక్షలు మీడియా ప్రతినిధులు తెలియజేశారు.

March 4, 2026 / 12:20 PM IST

ఏర్పాట్లను పర్యవేక్షించిన డీసీపీ

WGL: కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఏర్పాట్లను DCP అంకిత్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. గతంలో చోటుచేసుకున్న రాజకీయ వివాదాల దృష్ట్యా ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతలను కాపాడాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 4, 2026 / 12:20 PM IST