MDK: టేక్మాల్ మండలం వ్యాప్తంగా ఆయా గ్రామాలలో మంగళవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు హోలీ పురస్కరించుకుని పెద్ద ఎత్తున యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ అంటే ప్రేమానురాగాలను ప్రతీక అని అందరు సోదరభావంతో పండుగ జరుపుకోవాలని పలువురు అభిప్రాయ పడ్డారు.
JGL: బ్రహ్మోత్సవాలలో భాగంగా ధర్మపురి క్షేత్రం లోని బ్రహ్మ పుష్కరిణి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి డోలోత్సవం ఉదయం 7 గంటల లోపు పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, వీఐపీలకు మాత్రమే స్వామి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించారు. అనంతరం స్వామి వారిని ఆలయానికి తీసుకువెళ్లారు.
PDPL: గోదావరిఖని 5 ఇంక్లైన్ కాలనీ వంతెన పక్కన పారిశుధ్య లోపంతో అపరిశుభ్ర వాతావరణంలో దర్శనమిస్తోంది. మంథని – గోదావరిఖని ప్రధాన రహదారి పక్కన కుప్పలు కుప్పలుగా చెత్తాచెదారం నిండి పోయి దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. శివారు పరిశుభ్ర వాతావరణానికై అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జాతర ప్రధాన ఘట్టమైన ప్రభ బండ్ల ఊరేగింపు ఇవాళ ఉదయం జరగనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దీంతో హోలీ పండగ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకోనున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సుద్దాల చందు(22) అనే యువకుడు మంగళవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో మృతుడి తండ్రి శ్రీహరి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మృతితో మానసికంగా, ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందినట్లు తెలిపారు.
KMM: నేలకొండపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం విస్తృతంగా ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా భైరవునిపల్లి గ్రామానికి చెందిన BRS నాయకులు మాజీ సర్పంచ్ పెద్దపాక సత్యం, వారి సతీమణి సత్యవతి ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. అలాగే స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
MLG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని నేడు చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేశారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ప్రధాన ద్వారాన్ని అర్చకులు, నిర్వాహకులు శాస్త్రోక్తంగా ద్వారబంధనం చేశారు. గ్రహణం ముగిసిన తర్వాత బుధవారం ఉ. 6 గం పుణ్యాహవాచనం, సంప్రోక్షణ పూజలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.
WNP: వీపనగండ్ల మండల కేంద్రంలో సర్వే నెంబర్ 721లో ప్రభుత్వ భూమిలో చిరు వ్యాపారస్తులకు ఎమ్మార్వో ప్రభాకర్ రావు నోటీసులు జారీ చేశారు. బతుకు తెరువు కొరకు వేసుకున్న చిరు వ్యాపారస్తులు తమ సొంత స్థలంలా భావించడం సరైనది కాదని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మార్వో తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి అందరు సహకరించాలన్నారు.
HNK: పట్టణ కేంద్రంలో లావుడి సరిత (27) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆమె 2023 నుంచి నల్గొండ, హైదరాబాద్, నార్కెట్‌పల్లి ప్రాంతాల హాస్టళ్లలో ఉంటూ తనను డాక్టర్‌గా పరిచయం చేసుకుని యువతుల మొబైల్‌లు, నగదు దొంగిలించేది. విలాసవంతమైన జీవితం కోసం ఈ మోసం చేసినట్లు తెలిసింది. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ప్రజలు, చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హోలీ పండుగ సందర్భంగా తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో పెద్దలు, చిన్నారులు పలు రకాల రంగులు పూసుకుంటూ కేరింతల మధ్య హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
NRML: జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటివరకు రైతులు 1,60,000 వేల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా 1,40,000 బస్తాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో 14 మహిళా స్వయం సహాయక సంఘ భవనాల నిర్మాణానికి ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు వెల్లడించారు. బోయిన్పల్లి, చందుర్తి, ఇల్లంతకుంట, గంభీరావుపేట మండలాల పరిధిలోని పలు గ్రామాలకు ఈ నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఎంపీడీవో గీతాంజలి ఆధ్వర్యంలో ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. పంచాయతీ చట్టం, నాయకత్వ లక్షణాలు, కార్యదర్శుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీవో రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
GDWL: ఆదిశిలాక్షేత్రం మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7:30 గంటలకు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పిస్తామని ఛైర్మన్ పట్వారి ప్రహలాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాలా (వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అసోసియేషన్ సభ్యులందరూ ఒకరికొకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండగను శాంతియుతంగా, కేవలం సహజ సిద్ధమైన రంగులతోనే జరుపుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.