నిర్మల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాలా (వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అసోసియేషన్ సభ్యులందరూ ఒకరికొకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండగను శాంతియుతంగా, కేవలం సహజ సిద్ధమైన రంగులతోనే జరుపుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.