• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మధ్యాహ్న భోజనంను పరిశీలించిన సర్పంచ్

KMM: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం పథకాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ ఐతగాని వెంకటరమణ నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పెండ్ర అంజయ్య, ఐతగాని నవీన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌తో కలిసి మెనూ ప్రకారం భోజనం, కూరలు ఉన్నాయా అని వాటిని పరిశీలించారు.

March 2, 2026 / 02:30 PM IST

‘హోలీని సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలి’

JGL: జిల్లాలో హోలీ పండుగను ప్రజలు సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇతర మతాల వారిని గౌరవిస్తూ, మతసామరస్యంతో హోలీ పండుగ జరుపుకోవాలన్నారు. హోలీ పండుగ వేళ ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామన్నారు.

March 2, 2026 / 02:29 PM IST

బీజేపీ సీనియర్ నేత మధుసూదన్ రావు మృతి

KMM: బీజేపీ సీనియర్ నాయకులు, సత్తుపల్లి వాజ్ పేయిగా ప్రజల్లో ప్రసిద్ధి చెందిన చెక్క మధుసూదన్ రావు సోమవారం సత్తుపల్లిలో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావుతో సహా పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటించారు. మధుసూదన్ రావు మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

March 2, 2026 / 02:25 PM IST

పార్టీ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NLG: చింతపల్లి మండలం గొడుకొండ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాదేపల్లి పులిరాజ్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పులిరాజ్ గౌడ్‌ను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

March 2, 2026 / 02:18 PM IST

వివిధ పథకాల చెక్కులు అందజేత

SRD: ఆయా పథకాల కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఖేడ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం అందజేశారు. మండల పరిధిలోని అనంతసాగర్ లక్ష్మీకి కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేశారు. అదే విధంగా అరె మారుతి రావుకు మంజూరైన CMRF రూ.60 వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ పాటిల్, నాగిరెడ్డి, శివరెడ్డి, లోకేష్ రెడ్డి ఉన్నారు.

March 2, 2026 / 02:18 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షకు 97% హాజరు

PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన మొదటి సంవత్సరం గణితం/బాటని/ పొలిటికల్ సైన్స్ పరీక్షకు 97% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5780 మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 5613 మంది హాజరయ్యారు. మొత్తం 167 మంది గైర్హాజరయ్యారు.

March 2, 2026 / 02:13 PM IST

మార్చి 10న మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ

ఆదిలాబాద్: జిల్లాలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా వన్ టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 10న ఏఆర్ హెడ్ క్వార్టర్స్ జరగనున్న ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీలు పాల్గొని 2000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. నిరుద్యోగులు గూగుల్ ఫారమ్QR Code లింక్ ద్వారారిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

March 2, 2026 / 02:12 PM IST

రేపు శ్రీ రంగనాథ స్వామి ఆలయం మూసివేత

WNP: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 3 వ తేదీన శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి, తిరిగి రాత్రి 8 గంటలకు తెరుస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యావచనం, స్నాపన తిరుమంజనం, హోమాలు నిర్వహించనున్నారు. భక్తులు ఈ సమయాలను గమనించి సహకరించాలని కోరారు.

March 2, 2026 / 02:07 PM IST

మాదిగలకు రాజ్యసభ స్థానం ఇవ్వాలి: ఎమ్మార్పీఎస్

NGKL: కాంగ్రెస్ నుంచి మాదిగలకు రాజ్యసభ స్థానం కేటాయించాలని సోమవారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్లోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మూడు లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని కోరారు.

March 2, 2026 / 02:06 PM IST

వార్డు సభ్యులకు పరిపాలనపై అవగాహన సదస్సు

MBNR: జడ్చర్ల ఎంపీపీ కార్యాలయంలో నూతన వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్, కిష్టారం గ్రామ సభ్యులకు గ్రామ పరిపాలన, చట్టాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామసభల నిర్వహణపై అవగాహన కల్పించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యతలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు.

March 2, 2026 / 02:05 PM IST

వార్డు సభ్యులకు శిక్షణ

MDK: చేగుంట మండలంలో వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం సోమవారం చేపట్టారు. 13 గ్రామపంచాయతీలలోని 114 మంది వార్డు సభ్యులకు రెండో విడతగా శిక్షణ చేపట్టారు. శిక్షణ కార్యక్రమానికి వార్డు సభ్యులు హాజరై పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకోవాలని ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ విజయపాల్ రెడ్డి, ట్రైనర్ సంగమేశ్వర్ పాల్గొన్నారు.

March 2, 2026 / 02:04 PM IST

నారాయణపేటలో దుద్దిళ్ల జయంతి వేడుకలు

నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఘనంగా జరుపుకున్నారు. డీఎస్పీ లింగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సౌమ్య నాయకుడని, ప్రజల కష్టసుఖాలలో భాగస్వామి అయ్యారని తెలిపారు. ఎస్సై విజయ్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.

March 2, 2026 / 02:04 PM IST

ఇంటర్ పరీక్షలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

GDWL: ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం సురక్షితంగా తపాలా కార్యాలయానికి చేరవేయాలని అధికారులకు సూచించారు.

March 2, 2026 / 02:03 PM IST

ఇంటర్ పరీక్షకు 16 మంది గైర్హాజరు

SRPT: నడిగూడెంలోని గురుకుల కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 16 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో వోకేషనల్ కోర్సు నుంచి 5 మంది, జనరల్ నుంచి 11 మంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ఎస్సై ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆమె పేర్కొన్నారు.

March 2, 2026 / 02:02 PM IST

మోడల్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు

JGL: మల్యాల మండలం నూకపెల్లి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును మార్చి10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, వీరికి ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

March 2, 2026 / 02:02 PM IST