• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘గొప్పలు తప్ప ఆచరణలో విఫలం’

NLG: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుభరోసా పథకంపై గొప్పలు చెప్పుకుంటున్నవ్పటికీ, ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు. రైతులకు పెట్టుబడులు లేక అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

March 5, 2026 / 01:30 PM IST

జిల్లాలో జోరుగా అక్రమ రవాణా పట్టించుకోని అధికారులు

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్న కలెక్టర్లు, ఎమ్మార్వోలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పలు గ్రామాలలో ఉన్నత అధికారులకు ప్రజలు అక్రమ రవాణాను అడ్డుకోవాలని వినతి పత్రాలు అందజేసిన ఏ మాత్రం స్పందించడం లేదని అధికారులపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

March 5, 2026 / 01:30 PM IST

మార్చి 15న కాన్షీరాం జయంతి సభ

SRCL: బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా ఈ నెల 15న సిరిసిల్లలో సుమారు 5000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. సభ ఏర్పాట్లపై ఈ నెల 6న కామాక్షి బ్యాంకెట్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కమ్మెట అశోక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, పాల్గొన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

నలుగురు విద్యార్థుల గైర్హాజరు

NZB: ధర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్, ఆదర్శ కళాశాలల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథమెటిక్స్ 1బీ, జువాలజీ పరీక్షలకు మొత్తం 4 విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాసులు తెలిపారు. ఆదర్శ కళాశాలలో ఒకరు, ప్రభుత్వ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్షకు రాలేదని పేర్కొన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

‘సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి’

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం ఆదేశాల మేరకు నూతనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్, డ్రగ్స్ సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సమ్మద్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన భీమ్ భరత్

RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని భీమ్ చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. ఈరోజు శంకర్‌పల్లి మండల పరిధిలో చందిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంతోనే పేదలకు అన్ని పథకాలు అందుతాయని అన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్, నాయకులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:29 PM IST

అనంతగిరిపల్లిలో కలియతిరిగిన మున్సిపల్ వైస్ ఛైర్మన్

VKB: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి పదో వార్డులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి గురువారం పర్యటించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాలు తదితర అంశాలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి పరిస్థితిని వివరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు.

March 5, 2026 / 01:28 PM IST

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

PDPL: ధర్మారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 38 మంది లబ్ధిదారులకు 38,04,408 రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం అందజేశారు. పేద ఆడపిల్లలకు ఈ పథకం వరం, సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:27 PM IST

మహబూబాబాద్ నుంచే ఇద్దరు రాజ్యసభ సభ్యులు

MHBD: జిల్లాకు రాజకీయంగా అరుదైన గుర్తింపు లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వేముల నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఖరారు కావడంతో జిల్లాకు కేంద్ర స్థాయిలో ప్రాతినిధ్యం మరింత పెరిగింది. ఇప్పటికే వద్దిరాజు రవిచంద్ర BRS తరఫున 2022 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఒకే జిల్లాలో చెందిన వారు ఎంపిక కావడంలో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

March 5, 2026 / 01:26 PM IST

మహిళా శక్తి భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

ములుగు జిల్లా ఇంచర్ల శివారులోని ఎర్రి గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, డిఈ లింగ రెడ్డి, కాంట్రాక్టర్ కృష్ణ, అధికారులు ఉన్నారు.

March 5, 2026 / 01:26 PM IST

‘సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాలి’

ASF: గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టే అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో వార్డు సభ్యులు కీలకపాత్ర పోషించాలని జన్నారం మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీఓ జలంధర్, శిక్షకులు రాజన్న, ప్రసాద్ సూచించారు. జన్నారంలోని రైతు వేదికలో వివిధ గ్రామాల వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం గురువారం కొనసాగింది. గ్రామాలలో ఉండే సమస్యలు, పరిష్కారాల గురించి వివరించారు.

March 5, 2026 / 01:26 PM IST

చందంపేటలో నిరాహార దీక్ష కరపత్రాల ఆవిష్కరణ

NLG: చందంపేటలో ఎస్సీల సంక్షేమ పథకాల సాధనకై ఎమ్మార్పీఎస్  మండల అధ్యక్షుడు కొండ్రపల్లి నాగేష్ మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మార్చి 30న ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పగిడిమర్రి రవీందర్, కొండ్రపల్లి సత్యనారాయణ ఉన్నారు.

March 5, 2026 / 01:25 PM IST

ప్రైమ్ లీడింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌ను ప్రారంభించిన ఎంపీ

KMM: ప్రైమ్ లీడింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫైనాన్సియల్ సర్వీసెస్ హైదరాబాద్ సోమాజీగూడ అమిత్ ప్లాజాలో తన కార్యాలయాన్ని నెలకొల్పిందని ఆయన తెలిపారు. ఎంపీ గురువారం రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

March 5, 2026 / 01:22 PM IST

కలెక్టరేట్ ఎదుట స్కావెంజర్ల ధర్నా

SRCL: జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ ఏఐటీయుసీ నాయకులు అన్నారు. స్కావెంజర్లు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గురువారం ఏఐటీయుసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

March 5, 2026 / 01:21 PM IST

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

NGKL: ఊర్కొండ మండలం రాచలపల్లి గ్రామ పరిధిలోని కాల్యా తండాలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. తండాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఎంపీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం MP డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు.

March 5, 2026 / 01:21 PM IST