• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన : రాయల నాగేశ్వరరావు

KMM: ముదిగొండలో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఉన్నారు. భవనం దుస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు త్వరలోనే మరమ్మతులు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టా ఉపేందర్ పాల్గొన్నారు.

February 25, 2026 / 07:28 PM IST

‘దివ్యాంగులకు బడ్జెట్‌లో 5% నిధులు కేటాయించాలి’

SRD: దివ్యాంగులకు బడ్జెట్లో 5% నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతున్న 6000 పింఛన్ ఇస్తామన్న హామీ అమలు చేయలేదని విమర్శించారు.

February 25, 2026 / 07:28 PM IST

400 ఏళ్ల కోనేరు శుభ్రపరిచిన సేవా ఫౌండేషన్

SDPT: దుబ్బాక మండలం ధర్మాజీపేటలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ కోనేరును గ్రామ యువత పునరుద్ధరించారు. వేద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన కోనేరును, ఆలయ పరిసరాలను యువకులు, పెద్దలు కలిసి ఉత్సాహంగా శుభ్రం చేశారు. మన సంస్కృతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ పునఃప్రక్షాళన చేపట్టామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుతారి సందీప్ తెలిపారు.

February 25, 2026 / 07:26 PM IST

శిథిలావస్థకు చేరుకున్న పశువుల ఆసుపత్రి

BDK: జూలూరుపాడ్ మండలం గుండెపుడి గ్రామం నందు శిదిలావస్థలో ఉన్న పశువుల ఆసుపత్రి ని వెటర్నరీ డాక్టర్ సాయి సందీప్‌తో కలిసి దుద్దుకూరి సుమంత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో సుమంత్ చరవాణి ద్వారా ఆసుపత్రి భవనం స్థితిగతులను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే నూతన భవన నిర్మాణం చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

February 25, 2026 / 07:22 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

MDK: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పి మహేందర్ పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని పరీక్షా కేంద్రాలను మహేందర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, మెడికల్ ఎమర్జెన్సీ టీములు, విద్యార్థులకు కల్పించిన కనీస వసతులను పరిశీలించారు.

February 25, 2026 / 07:21 PM IST

గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్​

NZB: గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్​ను కలెక్టర్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ప్రధానమైన ఈ పుష్కర ఘాట్​ను బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.

February 25, 2026 / 07:20 PM IST

చెరువుల అభివృద్ధి వేగం పెంచండి: హైడ్రా కమిషనర్

HYD: నగరంలో చెరువుల అభివృద్ధిని వేగం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ రామచంద్రపురంలోని గంగారం చెరువుతోపాటు ఈర్ల చెరువును పరిశీలించారు. చెరువుల్లోకి నేరుగా మురుగు నీరు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. మురుగు కాలువలన్నింటిని అనుసంధానం చేసి ఎస్టీపీ వద్ద ట్రీట్ అయిన తర్వాతే చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

February 25, 2026 / 07:18 PM IST

సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధ‌వారం పరీక్ష ప్యాడ్లు,పెన్నులు పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా విద్యార్థులకు ఈ వస్తు సామగ్రిని అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. వార్డ్ కౌన్సిలర్ ఉదరి యాదయ్య పాల్గొన్నారు.

February 25, 2026 / 07:07 PM IST

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. బీజేపీ డిమాండ్​

NZB: జిల్లాలోని రుద్రూర్ బాన్సువాడ నిజామాబాద్​లో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. హైదరాబాద్​లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్​రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హిందువులపై కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

February 25, 2026 / 07:05 PM IST

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: డీజీపీ

PDPL: మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పెద్దపల్లి డీజీపీ రామ్ రెడ్డి సూచించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. వేగ పరిమితులను పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు.

February 25, 2026 / 07:05 PM IST

అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్‌కు వినతి

MDCL: మల్కాజ్‌గిరి జోన్ అల్వాల్ పరిధిలోని డివిజన్లు 190, 191లలో సివిల్ పనులు, పార్కుల అభివృద్ధిపై జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్‌ను ఈరోజు కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రతిపాదనలపై స్పందించిన కమిషనర్ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

February 25, 2026 / 07:04 PM IST

‘లక్ష్యానికి చేరువగా జిల్లా రుణ ప్రణాళిక’

SRPT: జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో 88.44 శాతం పురోగతి సాధించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రూ.11,919 కోట్ల లక్ష్యానికి గాను రూ.10,541 కోట్లు ప్రజలకు అందించామన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 96 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సీతారామారావు ఉన్నారు.

February 25, 2026 / 07:04 PM IST

‘బాధితులకు సత్వర న్యాయం అందించాలి’

NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన ఆరుగురు ఆర్జిదారుల ఫిర్యాదులను తీసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో వెంటనే మాట్లాడి చట్టపరమైన సహాయం అందించాలని ఆదేశించారు.

February 25, 2026 / 07:02 PM IST

‘ఆరోగ్య, భీమా పథకాలు ఆగకుండా చూడాలి’

JGL: ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, భీమా పథకాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలని సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ.. భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేసి పీఆర్సీ ప్రకటించాలని CM రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

February 25, 2026 / 07:02 PM IST

జిల్లా ఓసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ADB: జిల్లా ఓసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ప్రఫుల్ వజే, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కౌటిక్ రాజేశ్వర్ ఎన్నికయ్యారు. బుధవారం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ కొత్త కమిటీని ప్రకటించి, సభ్యులను ఘనంగా సన్మానించారు. ఓసీ వర్గాల ఐక్యతే లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

February 25, 2026 / 07:01 PM IST