• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఫోటో గ్రాఫర్ల భవనానికి ‘బోరు’ దాతగా మాజీ కౌన్సిలర్

దేవరకొండలో స్థానిక వీడియో, ఫోటో అసోసియేషన్ భవన అవసరాల కోసం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్ మంచినీటి బోరును వేయించి తన ఉదారతను చాటుకున్నారు. భవన నిర్మాణంలో ఎదురవుతున్న నీటి ఎద్దడిని గుర్తించిన ఆమె సొంత ఖర్చులతో బోరు వేయించి ఫోటోగ్రాఫర్లకు అండగా నిలిచారు. ​ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

February 27, 2026 / 12:49 PM IST

మీటర్ల ‘మాయాజాలం’.. రూ. 450 కోట్ల SCAM..?

HYD: నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్‌లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ. 450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.

February 27, 2026 / 12:49 PM IST

మహిళలు ఆర్థికంగా వ్యవస్థాయికి రావాలి : ఎమ్మెల్యే

MBNR: మహిళా సాధికారతపై సమాజాభివృద్ధికి పునాది అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. నా భారత్ ఆర్థిక సహకారంతో, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహబూబ్నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి గ్రామ దుకాణాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు.

February 27, 2026 / 12:45 PM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

PDPL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్‌లో రామగుండం విద్యార్థులు సత్తా చాటారు. రామగుండం జపాన్ షిటోరియా కరాటే స్కూల్‌కు చెందిన ముక్తిశ్రీ 47 కేజీల విభాగంలో వెండి పతకం సాధించగా, 54 కేజీల విభాగంలో సహస్ర కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ కరాటే శ్రీనివాస్, సురేశ్,శ్రీనివాస్, శోభారాణి విజేతలను అభినందించారు.

February 27, 2026 / 12:43 PM IST

గుండెపోటుతో యువ సాఫ్ట్‌వేర్ మృతి

GDWL: రాజోలి గ్రామానికి చెందిన రాజేష్ గౌడ్ (32) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కష్టపడి పైకొచ్చిన రాజేష్ మరణ వార్త విని బంధుమిత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

February 27, 2026 / 12:42 PM IST

కొనసాగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు

RR: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీలో కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తమ హయాంలోనే ఈ పనులకు నిధులు మంజూరు చేయించామని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

February 27, 2026 / 12:40 PM IST

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమీక్ష

MDK: రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మెదక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్‌లతో కలిసి సమీక్షించారు. జిల్లా ఎస్పీడీ.వి శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ట్రైనీ గ్రూప్ వన్ ఆఫీసర్ సింధు పాల్గొన్నారు.

February 27, 2026 / 12:40 PM IST

బషీరాబాద్‌లో ఆగిన ‘హుబ్లీ’.. ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది!

VKB: నవాందీ రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్ ప్రారంభమైంది. MP కొండ విశ్వేశ్వర్ రెడ్డి, MLA బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించి రైలుకు పచ్చజెండా ఊపారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బషీరాబాద్ రవాణా పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

February 27, 2026 / 12:39 PM IST

ఎక్స్ ప్రెస్ సర్వీస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BHPL: గణపురం మండలం నుండి హైదరాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. బస్సు సర్వీసును గణపురం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు వచ్చిన ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు.

February 27, 2026 / 12:39 PM IST

పేదలకు ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 27, 2026 / 12:34 PM IST

పోచారం ప్రాజెక్టు నుంచి 0.541టీఎంసీల నీటిని విడుదల

KMR: పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం ఇప్పటి వరకు 0.541TMCల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం నుంచి ప్రాజెక్టులోకి మొత్తం 30.543 TMCల నీరు వచ్చి చేరిందని అన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత వల్ల 30 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోందని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820TMCలు కాగా,ప్రస్తుతం 1.05TMC నీరు నిల్వ ఉంది.

February 27, 2026 / 12:34 PM IST

ధ్వజ స్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న హరీశ్ రావు

సిద్దిపేట పట్టణంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ కమిటీ సభ్యులు హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్వజ స్తంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

February 27, 2026 / 12:34 PM IST

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవుని ఎర్రవల్లి 3వ వార్డులో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని కౌన్సిలర్ మీనాక్షి సత్యనారాయణ నిలబెట్టుకున్నారు. శుక్రవారం పాత బోరుకు మరమ్మతులు చేయించి నీటిని ప్రారంభించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ పరిష్కరించే కౌన్సిలర్‌పై వార్డు ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 12:32 PM IST

గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే

SRD: వీరారెడ్డిపల్లిలో రూ.25 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో మొల్లగూడెం పాఠశాల ప్రహరీ గోడకు రూ.10 లక్షలు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

February 27, 2026 / 12:31 PM IST

కౌన్సిలర్ సతీమణిని పరామర్శించిన మాజీ ఎంపీ

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ రావుల వినయ్ సతీమణి రావుల మనీషా అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఇవాళ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

February 27, 2026 / 12:29 PM IST